- ముగ్గురు విప్ల నియామకంపై నేడో, రేపో ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశా ల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటి కే డిప్యూటీ స్పీకర్‌గా డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ పేరును ప్రకటించారు. ఈ సెషన్ లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ లాబీల్లోని మం త్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజన ర్సింహ చాంబర్లను ఖాళీ చేయించారు.
ఈ ఇద్ద రు మంత్రుల చాంబర్లను కలిపి డిప్యూటీ స్పీకర్ కార్యాలయంగా మార్చే పనులను స్పీడప్ చేశారు. దీంతో ఈ సెషన్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ఇక విప్ల నియామకంపై కూడా ఒకటిరెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువ డనున్నట్లు సమాచారం. విప్‌లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మూడో పేరుకు దళిత కోటాలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లేదా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీ కృష్ణలలో ఒకరికి దక్కే అవకాశం ఉందని పీసీసీవర్గాలు చెప్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే వేముల వీరేశంకు, మాల సామా జిక వర్గానికి అవకాశం ఇస్తే వంశీ కృష్ణకు ఆ పదవి దక్కవచ్చని అంటున్నారు.
ఈ నలుగురిలో ముగ్గురి పేర్లు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్ ఖరారు చేశారని, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడడమే తరువాయి అని పీసీసీ వర్గా లు చెప్తున్నాయి. సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్‌కు విప్ల నియామకానికి సంబంధం లేదని, విప్ల నియామకం నిర్ణయం జరిగిపోయిందని పీసీ సీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యునిగా వేం నరేం దర్ రెడ్డి ఎన్నికైనందున ఆయన్ను మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ పెద్దలను కలిపించేందుకే సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ అని పీసీసీ నేతలు స్పష్టం చేశారు.
