టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, తమ పర్సనల్ లైఫ్‌ను సెలబ్రేట్ చేసుకోవడంలో ఈ జోడీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వరుసగా రిసెప్షన్లు, స్వీట్ల పంపిణీతో అభిమానులను ఖుషీ చేశారు. లేటెస్ట్ గా ఈ జంట ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మేము ముగ్గురమయ్యాం..
లేటెస్ట్ గా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న యానిమేషన్ క్లిప్ నెటిజన్లను కన్ఫ్యూజన్లో పడేసింది. "ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం" అంటూ పెట్టిన క్యాప్షన్ చూసి, రష్మిక తల్లి కాబోతోందా? నెల రోజులకే గుడ్ న్యూస్ చెప్పేసిందా? అని ఫ్యాన్స్ హడావిడి చేశారు. అయితే, అసలు విషయం అది కాదు. ఆ యానిమేషన్ ప్రపంచంలోకి రష్మిక తన భర్త విజయ్ను ఆహ్వానించింది. ఆ వీడియోలో రష్మిక, విజయ్ , వారి ప్రియమైన పొద్దుతిరుగుడు పువ్వు 'రూ' కలిసి కనిపిస్తున్నారు. రష్మిక టీ-షర్ట్‌పై ఉన్న గుడ్డు బొమ్మ, కేవలం ఒక క్రియేటివ్ యానిమేషన్ ఎలిమెంట్ మాత్రమే. అంటే, ఇప్పుడు ఈ డిజిటల్ ఫ్యామిలీలో విజయ్ కూడా భాగమయ్యారన్నమాట!
ఏమిటీ 'రష్మిక & రూ' సందడి?
ప్రముఖ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ 'టెర్రిబ్లీ టైనీ టేల్స్' (TTT) సహకారంతో రష్మిక గతంలోనే 'రష్మిక & రూ' (Rashmika & Ru) అనే యానిమేటెడ్ ఐపిని ప్రారంభించింది. రష్మికలోని ఉత్సాహాన్ని, పాజిటివిటీని ప్రతిబింబించేలా ఈ యానిమేటెడ్ క్యారెక్టర్ 'రూ' పేరుతో ఒక పొద్దుతిరుగుడు పువ్వు రూపొందించబడింది. లోకంలో కేవలం ఆనందాన్ని, దయను పంచడమే లక్ష్యంగా సాగే ఈ కథల్లోకి ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు.
బడ్డీమూన్
పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లకుండా, స్నేహితులతో కలిసి 'బడ్డీమూన్' వెళ్లిన ఈ జంట స్టైలే వేరు. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా కూడా కలిసి పనిచేస్తూ బ్రాండ్ వాల్యూను పెంచుకుంటున్నారు. విజయ్ ఎంట్రీతో 'రష్మిక & రూ' సిరీస్‌కు కొత్త కళ వచ్చింది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని యానిమేటెడ్ రూపంలో చూడటం అభిమానులకు కనువిందుగా ఉంది. స్టోరీ టెల్లింగ్‌ను, స్టార్ పవర్‌ను కలిపి TTT చేసిన ఈ ప్రయోగం సూపర్ హిట్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..
ఒక పక్క సినిమాలు చేస్తూనే, ఇలాంటి క్యూట్ డిజిటల్ కంటెంట్‌తో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండటం ఈ 'విష్మిక' (ViRash) జోడీకి మాత్రమే సాధ్యం అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ జంట 'రణబాలి' మూవీలో కలిసి నటిస్తున్నారు. ఇప్పుటికే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ గా లీక్ అయిన విజయ్ దేవరకొండ షూటింగ్ వీడియో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. భారీ అంచనాలతో నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
