వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎస్ సరస్వతి’ (S Saraswathi). సోషల్ మెసేజ్‌తో పాటు ఎంగేజింగ్ క్రైమ్ డ్రామాగా వరలక్ష్మి ఈ సినిమాను తెరకెక్కించింది. మార్చి 6న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులని అలరించింది. అయితే, వరలక్ష్మి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
ఇపుడు ఈ క్రేజీ థ్రిల్లర్ సడెన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నించే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
‘ఎస్ సరస్వతి’ ఓటీటీ:
థియేట్రికల్ రన్ ముగించుకున్న‘ఎస్ సరస్వతి’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా, త్వరలోనే ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.
Truth, justice and a story that demands to be seen 🙌#SsaraswathiOnPrime, Watch Now : https://t.co/eSdnEpN8Re pic.twitter.com/GjbJ0aG4B2
— prime video IN (@PrimeVideoIN) April 3, 2026
‘ఎస్ సరస్వతి’ కథ:
లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక సింగిల్ మదర్. కూతురు సరస్వతి (నివేక్ష) ఆమెకు ప్రపంచం. ఒక రోజు స్కూల్‌కి వెళ్లిన సరస్వతి కనిపించకుండా పోతుంది. తర్వాత స్కూల్‌లోనే అత్యాచారానికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది.
అయితే, ఎటువంటి సాక్ష్యాలు లేక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, లక్ష్మి న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయం చేసినా కేసు బలహీనమవుతుంది. చివరికి కోర్టు కేసును కొట్టేయాల్సి వస్తుంది.
►ALSO READ | SDT19: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్.. ‘క’ డైరెక్టర్స్తో భారీ మైథికల్ యూనివర్స్!
ఈ క్రమంలోనే, లక్ష్మి ఓ జడ్జిని, ఐఏఎస్ అధికారినిని, పోలీస్‌ని హత్య చేస్తుంది. అసలు సరస్వతిపై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు? లక్ష్మి ఎందుకు ఆ హత్యలు చేసింది? కేసు విచారణ క్రమంలో.. లాయర్ రామానుజానికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్, మురళి శర్మల పాత్ర ఏంటి? చివరకు సరస్వతికి న్యాయం దొరికిందా? అనేది మిగతా కథ.
మూవీ ఎలా ఉందంటే:
సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నించే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ తల్లి–కూతుళ్ల బాండింగ్ చూపించగా, సెకండాఫ్ పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ రూం డ్రామాగా మారుతుంది.
సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను సైకలాజికల్ కోర్ట్ రూం థ్రిల్లర్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కథలో వచ్చే ట్విస్ట్‌లు, ముఖ్యంగా ప్రీ–ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ సినిమాపై ఉత్కంఠను రేకేత్తిస్తోంది. పాప కేసు కోసం ప్రకాశ్‌రాజ్ పాత్ర రంగంలోకి దిగినప్పటి నుంచి కథలో మరింత సంఘర్షణ మొదలవుతుంది.
అయితే, కోర్టు విచారణ సీన్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఇస్తోంది. ఓవరాల్గా ప్రీక్లైమాక్స్ ట్విస్ట్.. క్లైమాక్స్ ఘట్టం సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలిచాయి.
