SDT19: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్.. ‘క’ డైరెక్టర్స్తో భారీ మైథికల్ యూనివర్స్!

SDT19: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్.. ‘క’ డైరెక్టర్స్తో భారీ మైథికల్ యూనివర్స్!

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej). గతేడాది 'విరూపాక్ష'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే ఆశ్చర్యపరిచేలా ఒక భారీ పాన్-ఇండియా మైథికల్ యాక్షన్ విజువల్ వండర్ని తీసుకొస్తున్నాడు. 

SDT19 అధికారిక ప్రకటన

శుక్రవారం ఏప్రిల్ 3, 2026న సాయిధరమ్ తేజ్ తన కొత్త సినిమా ప్రకటించాడు. కిరణ్ అబ్బవరం ‘క’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకులు సుజిత్ - సందీప్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

‘SDT 19’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా మైథికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఉత్కంఠ కలిగిస్తోంది. ఒక యోధుడి గెటప్‌లో, చేతిలో భారీ కత్తి పట్టుకుని కొండపై నిలబడి అడవి వైపు సీరియస్‌గా చూస్తున్న తేజ్ లుక్ క్యూరియాసిటీ పెంచుతోంది. ‘‘యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకు అందని శక్తులు.. అత్యంత శక్తిమంతమైన ప్రయాణం’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ, ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముఖ్యంగా, సాయిధరమ్ తేజ్.. తన తల్లి పేరుతో స్థాపించిన ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’ ఈ ప్రాజెక్ట్‌తో మొదటిసారి నిర్మాణంలో భాగమవుతోంది.

మరో భారీ ప్రాజెక్ట్ – రోహిత్ కెపీ దర్శకత్వంలో

నూతన దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 'హనుమాన్' నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తన రూపం నుండి బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ మార్చేశారు.

►ALSO READ | Biker Review: ‘బైకర్’ రివ్యూ.. శర్వానంద్ రేసింగ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

గతంలో విడుదలైన 'అసుర ఆగమన' గ్లింప్స్లో ఆయన ఇంటెన్సిటీ చూస్తేనే అర్థమవుతోంది ఆయన ఈ పాత్ర కోసం ఎంతగా శ్రమిస్తున్నారో. రిస్క్ తో కూడుకున్న ఎన్నో స్టంట్స్ ను ఆయన ఎటువంటి డూప్ లేకుండా స్వయంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. భూమి, సంస్కృతి, పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌‌గా నటిస్తుండగా,  జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మొత్తంగా సాయి ధరమ్ తేజ్ వరుసగా భారీ కాన్సెప్ట్‌లతో టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసే అవకాశముంది.