IPL 2026: పంజాబ్ Vs చెన్నై మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే.. టాస్ గెలిస్తే బౌలింగ్ బెస్ట్..!

IPL 2026: పంజాబ్ Vs చెన్నై మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే.. టాస్ గెలిస్తే బౌలింగ్ బెస్ట్..!

ఐపీఎల్ 19వ సీజన్‎లో మరో హైవోల్టేజ్ పోరుకు సమయం ఆసన్నమైంది. టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‎లో తొలి మ్యాచులోనే ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఊపుమీదుండగా.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమితో టోర్నీ ప్రారంభించింది చెన్నై. దీంతో సొంతగడ్డపై రాణించి సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేయాలని సీఎస్కే ఆశిస్తోంది. 

చెన్నై మాజీ సారథి ధోనీ గాయం కారణంగా ఆటకు దూరం కావడం, భారీ అంచనాలు పెట్టుకున్న సంజు శాంసన్ విఫలం కావడం చెన్నై అభిమానులను ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు తొలి మ్యాచులో జీటీపై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ చెన్నైను చిత్తు చేసి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరీ ఆసక్తికర పోరు జరగనున్న చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్, వెదర్ వెదర్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. 

ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్ట్:

ఎంఏ చిదంబరం స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‎కు అనుకూలం. ఈ పిచ్‎లో యావరేజ్ స్కోర్ 173. బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే 200 నుంచి 230 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీన్నిబట్టి చూస్తే ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతో ఈ గేమ్‌లో భారీగా పరుగులు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మ్యాచ్ సాగుతున్న కొద్దీ మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలిచిన టీమ్ ముందుగా  బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

►ALSO READ | మొన్న రాహుల్, నిన్న పంత్.. ఈ టార్చరేంటి..? గోయెంకాను బ్యాన్ చేయాలి: ఐపీఎల్ మాజీ చైర్మన్

ఈ స్టేడియంలో జరిగిన చివరి 7 టీ20 మ్యాచుల ఫలితాలు:

మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు - 4
మొదట బౌలింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు - 3
సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు - 169
అత్యధిక స్కోరు - 256 (భారత్ vs జింబాబ్వే)
అత్యల్ప స్కోరు - 173, యూఏఈ మరియు కెనడా vs న్యూజిలాండ్

స్క్వాడ్‌లు

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(w), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ , మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ , హర్‌ప్రీత్ బర్బెర్, విష్ణు సుర్‌ప్రీత్ బర్బే, షెడ్జ్, యష్ ఠాకూర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, బెన్ ద్వార్షుయిస్, లాకీ ఫెర్గూసన్, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, ముషీర్ ఖాన్, పైలా అవినాష్, విశాల్ నిషాద్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు : సంజూ శాంసన్(w), రుతురాజ్ గైక్వాడ్(c), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, కార్తీక్ శర్మ, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ , సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ గ్జాప్ నీత్, గ్రాహుల్ చాహర్, రాహుల్ హోసేన్, ఎంఎస్ ధోని , శ్రేయాస్ గోపాల్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, అమన్ ఖాన్, డెవాల్డ్ బ్రెవిస్, జకరీ ఫౌల్కేస్, ఉర్విల్ పటేల్