రాష్ట్రంలో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా బయట రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టాప్ ఫార్చున్ 500 కంపెనీల్లో ఒకటైన మాస్ మ్యూచువల్ ను రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వారానికి ఇంతకు మించిన శుభారంభం ఏముంటుంద్నారు.
What better way to start the week than to welcome a top Fortune-500 company
Delighted to announce that BFSI major US based @massmutual is setting up their Global Capability Center in Hyderabad, Telangana
This is their first center outside US with initial investment of ₹1000 Cr pic.twitter.com/ziCR36sIvv
— KTR (@KTRTRS) January 11, 2021
