విమానంలో ఏ సీటు సురక్షితమైనది?.. అక్కడ కూర్చుంటే ప్రమాదం తప్పదా..?

విమానంలో ఏ సీటు సురక్షితమైనది?.. అక్కడ కూర్చుంటే ప్రమాదం తప్పదా..?

ఈ రోజుల్లో చాలా మంది విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. కారణం సమయం వృథా కాకుండా ఉంటుందని కొందరు భావిస్తే.. సురక్షితమైనదిగా మరికొందరు భావిస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు రోజురోజూకూ పెరగడమూ దీనికి కారణంగా తోస్తోంది. విమానంలో ప్రయాణించినా ప్రమాదం జరగదని ఏం గ్యారెంటీ లేదు. కానీ ఛాన్స్ మాత్రం తక్కువ. విమానం గాల్లోకి ఎగరడానికి ముందు సిబ్బంది చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా ప్రమాదం జరగదని చెప్పలేం. కొన్ని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రమాదాలు జరుగుతుండడం చూస్తూనే ఉంటాం. కానీ ప్రమాద సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరి విమానంలో అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏది..? ఏ సీట్లో కూర్చుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
 
ఇప్పటి వరకు జరిగిన దాదాపు అన్ని విమాన ప్రమాదాల్లో మనం కూర్చున్న సీటు విమానానికి మధ్యలో ఉంటే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని ఏవియేషన్ నిపుణుడు వేన్స్ హిల్డర్‌మాన్ వాన్స్ హిల్డర్‌మాన్ తెలిపారు. ఈ వ్యక్తులు భయంకరమైన ప్రమాదంలోనూ బయటపడ్డారని వెల్లడించారు. విమానం రెక్కలున్న ప్రాంతంలో కూర్చున్న వారికి కూడా కాస్త తక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారన్నారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోదగిన విషయం కూడా ఒకటుందని, అదేంటంటే ఈ విమాన రెక్కలలో ఇంధన కంటైనర్లు ఉంటాయి.. ప్రమాదం సమయంలో కొన్నిసార్లు అవి పేలిపోతాయి కూడా.. అలా జరిగినట్టయితే మొదట మీరే చనిపోతారని హెచ్చరించాకు. ఈ ప్రమాదాలను నివారించడంలో మానవ మెదడు సైతం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వాన్స్ హిల్డర్‌మాన్ చెప్పారు. మానసికంగా దృఢంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అటువంటి పరిస్థితిలో మీరు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఓపికతో ఉండి, మీ జీవితాన్ని కాపాడుకోవాలని హితవు బోధించారు.