వరుసగా 6 ఓటములు.. ప్లేఆఫ్స్కి వెళ్లేందుకు పంజాబ్‌కు ఛాన్స్.. నేడు లక్నోతో బిగ్ ఫైట్!

వరుసగా 6 ఓటములు.. ప్లేఆఫ్స్కి వెళ్లేందుకు పంజాబ్‌కు ఛాన్స్.. నేడు లక్నోతో బిగ్ ఫైట్!

LSG vs PBKS: ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు చేరిన తరుణంలో.. లక్నో వేదికగా ఇంట్రెస్టింగ్‌ మ్యాచ్ జరగబోతుంది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన పంజాబ్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రోజు గెలుపు ఖచ్చితంగా అవసరం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే పంజాబ్ టోర్నీ నుంచి అధికారికంగా అవుట్ అవుతుంది. 

మరోవైపు హోమ్ టీమ్ లక్నో సూపర్ జాయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినప్పటికీ.. ఈ సీజన్ ఆరంభంలో పంజాబ్ చేతిలో ఎదురైన 54 రన్స్ ఘోర పరాభవానికి పగ తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా ఈ సీజన్‌లో ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో మొదట ఫీల్డింగ్ చేసిన జట్లే 60 శాతం మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి మ్యాచ్ కావడం, మంచు (Dew) ప్రభావం చూపే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 

పిచ్ రిపోర్ట్: 
లక్నోలోని ఎకానా స్టేడియంలోని పిచ్ ఎప్పుడూ స్లోగా ఉంటూ బౌలర్లకు విపరీతంగా సహకరిస్తుంది. ఈ నల్ల రేగడి (Black Soil) పిచ్‌పై క్వాలిటీ స్పిన్నర్లు, పేస్ వైవిధ్యం (Cutters) ప్రదర్శించే మీడియం పేసర్లు వికెట్ల తీసుకుని పండగ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడ పవర్ హిట్టింగ్ చేయడం అంత ఈజీ కాదు, షాట్స్ మిస్ టైమ్ అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లకు చిక్కడం ఖాయం. పైగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పేసర్లు సుదీర్ఘ స్పెల్స్ వేయడం కష్టమే.

►ALSO READ | CSK హెడ్ కోచ్‌గా ధోనీ?.. అశ్విన్ ట్వీట్ వెనుక అసలు గుట్టు ఇదేనా!

ఎవరు గెలుస్తారంటే!:  
ప్రస్తుత ఫామ్, గెలుపు అవకాశాలను విశ్లేషిస్తే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ లోనే లక్నోపై ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు బాది, 54 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్ లైన్ అప్‌తో పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్ మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 

ఇరు జట్ల అంచనా:

లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, మార్క్రామ్, రిషభ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ఆయుష్ బదోని, షాబాజ్ అహ్మద్, ఎమ్ సిద్ధార్థ్, మోహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మహమ్మద్ షమీ. (ఇంపాక్ట్ ప్లేయర్స్: దిగ్వేష్ రాఠీ / అబ్దుల్ సమద్)

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, కూపర్ కానల్లీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. (ఇంపాక్ట్ ప్లేయర్స్: హర్‌ప్రీత్ బ్రార్ / మిచెల్ ఓవెన్)