హుస్సేన్​సాగర్​ తీరాన కట్టడాలేంది?

హుస్సేన్​సాగర్​ తీరాన కట్టడాలేంది?

ఎఫ్​టీఎల్​లో సర్కారే ఆక్రమణలకు పాల్పడుతోంది
 హైకోర్టుకు లెటర్​ రాసిన లుబ్నా సార్వత్​ పిల్ గా స్వీకరించిన కోర్టు

హైదరాబాద్‌‌‌‌, వెలుగుహుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ పరిధిలో సర్కారే ఆక్రమణలకు పాల్పడుతోందని సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్‌‌‌‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌‌‌‌గా స్వీకరించింది. చీఫ్​జస్టిస్​ఆర్ఎస్‌‌‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ అభిషేక్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ బుధవారం విచారణ జరిపింది. ప్రతివాదులకు నోటీసులిచ్చింది. కౌంటర్‌‌‌‌ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్‌‌‌‌ శాఖ ముఖ్య కార్యదర్శి, పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు మెంబర్‌‌‌‌ సెక్రటరీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్‌‌‌‌ బోర్డులను ఆదేశించింది. ‘హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌ పరిసర ప్రాంతంలో ప్రభుత్వమే పార్కులు, టూరిజం డెవలప్​మెంట్​పేరుతో ఆక్రమణలకు పాల్పడుతోంది. ప్రజలు తప్పు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వమే చట్టవ్యతిరేకంగా పని చేస్తోంది. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌లో ప్రభుత్వమే ప్లాట్లు చేసింది, దీనివల్ల చారిత్రక హుస్సేన్‌‌‌‌సాగర్‌‌‌‌కు ముప్పు ఏర్పడుతుంది’ అని లుబ్నా సార్వత్‌‌‌‌ హైకోర్టుకు రాసిన లెటర్​లో పేర్కొన్నారు. దీంతో ఫీల్డ్​ లెవెల్​లో  నిజానిజాలు పరిశీలించి రిపోర్టు ఇచ్చేందుకు హైకోర్టుకు సహాయకారి(ఎమికస్‌‌‌‌క్యూరీ)గా  సీనియర్‌‌‌‌ లాయర్‌‌‌‌ ఎల్‌‌‌‌.రవిచందర్‌‌‌‌ను డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ నియమించింది. 4 వారాల్లో కౌంటర్‌‌‌‌ ఫైల్​ చేయాలని ఆదేశించింది.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61