నీరజ్ చోప్రా బయోపిక్.. హీరో అక్షయ్

నీరజ్ చోప్రా బయోపిక్.. హీరో అక్షయ్


వందేళ్ల భారతీయుల కలను సాకారం చేశాడు యంగ్ అథ్లెట్ నీరజ్ చోప్రా. మెన్స్ జావెలింగ్ థ్రోలో  గోల్డ్ కొట్టి సత్తా చాటాడు. వ్యక్తిగత క్రీడల్లో అభినవ్ బింద్రా తర్వాత మెడల్ అందుకుని... 130 కోట్ల మంది దేశ ప్రజల ఆశలను బంగారు మయం చేశాడు నీరజ్ చోప్రా. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య..! పతకం గెలిచామా లేదా అనే స్టైల్లో అతి చిన్న వయసులో భారత్ కు గోల్డ్ మెడల్ అందించాడు నీరజ్ చోప్రా.

గోల్డ్ మెడల్ గెలవక ముందు వరకు.. ఒక లెక్క... ఇప్పుడు మరో లెక్క అంటూ దేశవ్యాప్తంగా తన పేరును మోరుమోగించేస్తున్నాడు నీరజ్ చోప్రా. ఇన్ స్టాగ్రామ్ లో లక్ష వరకూ ఉండే ఫాలోవర్ల సంఖ్యను ఇప్పుడు ఏకంగా  30 లక్షలకు పైగా పెంచుకున్నాడంటే మనవాడి క్రేజ్  ఏ రేంజ్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఓ అథ్లెట్ గానే కాకుండా అతడి లుక్స్ కి, స్టైల్  కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ హీరోలను మించిన గ్లామర్ అండ్ ఫిట్ నెస్ తో మనవాడి కటౌట్ ఇప్పుడు ఫుల్ క్రేజీగా మారిపోయింది.

ఓ వైపు నీరజ్ కు దేశ ప్రముఖులు, రాజకీయ నేతల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. వీటన్నింటితో పాటు నీరజ్  బయోపిక్  దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఆ మూవీలో హీరోగా ఎవరు చేస్తే బాగుంటుందన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో తన బయోపిక్ లో ఎవరైతే బాగుంటారనే ప్రశ్నకు నీరజే స్వయంగా అక్షయ్ కుమార్ తో పాటు హరియాణాకు చెందిన రణదీప్ హుడా నటించాలని చెప్పాడు నీరజ్ చోప్రా.

ఒలంపిక్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత అక్షయ్ కుమార్, రణ్ దీప్  హుడా ఇద్దరూ ట్విటర్ లో నీరజ్ కు విషెస్ చెప్పారు. ఎప్పుడు డిఫరెంట్, రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే అంశాలపై బయోపిక్ లతో... అలరించే అక్షయ్ కు ఇప్పుడు ఫ్యాన్స్  సరదా పంచ్  విసురుతున్నారు. అక్షయ్  కు కొత్త సినిమా దొరికిందని ఒకరంటే.. గతంలో జావెలిన్  త్రో దిగిన ఓల్డ్ పిక్ ను పోస్ట్  చేస్తున్నారు. నీరజ్ చోప్రా బయోపిక్  సెట్స్  నుంచి లీక్  అయిన ఫొటోస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

నీరజ్  మరో అభిమాన నటుడు రణ్ వీర్  హుడా.. ఫుల్ ఖుషీగా ఉన్నాడు. రణ్ వీర్ యాక్టర్ గానే కాదు... స్పోర్ట్స్ స్టార్ కూడా. హరియాణాలోని మోతీలాల్ నెహ్రూ స్కూల్  ఆఫ్  స్పోర్ట్స్ లో స్విమ్మింగ్ , ఇక్విస్ర్టియన్  స్పోర్ట్స్ లోనూ శిక్షణ పొంది జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్ అందుకున్నాడు. నిజంగా.. జావెలిన్ ని పాతావ్ ’’ అంటూ నీరజ్ ను విషె చేస్తూ ట్వీట్  చేశాడు రణ్ వీర్. అంతేకాదు నీరజ్  నీరజ్ అని జపం చేస్తే.. రజనీ రజనీ అని వినిపిస్తుందనీ.. రజనీకాంత్  ప్రతీచోటా ఉన్నాడని.. నీరజ్ - రజనీ ఇద్దరినీ లింక్ చేస్తూ ట్వీట్  చేయడం వైరల్  మారింది. ఒలింపిక్స్  అథెట్ల విభాగంలో వందేళ్ల రికార్డును బద్దలుకొట్టిన నీరజ్ బయోపిక్ లో ఎవరు హీరోగా నటిస్తారన్నది బాలీవుడ్ లో హాట్ టాఫిక్ అయ్యింది.