కాలేజ్ గర్ల్స్‌కు ఫ్రీగా స్కూటీలిస్తాం.. అమిత్ షా

కాలేజ్ గర్ల్స్‌కు ఫ్రీగా స్కూటీలిస్తాం.. అమిత్ షా

కమ్రూప్: ప్రేమ పేరుతో బలవంతంగా మతమార్పిడులకు పాల్పడే లవ్ జిహాద్‌‌కు తాము వ్యతిరేకమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. లవ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అస్సాంలోని కమ్రూప్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి. అయితే వీటిల్లో లవ్, ల్యాండ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడాన్ని ప్రధానంగా చెప్పొచ్చు’ అని షా చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్నారు. అస్సాంను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మార్చామని పేర్కొన్నారు.