LSG vs PBKS: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో అజేయంగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS).. ఆ తర్వాత వరుస ఓటములతో ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసు కోసం పోరాడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సేన నేడు లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జాయింట్స్ (LSG) తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలాంటి సమీకరణాలు ఉండాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పాయింట్ల పట్టికలో పంజాబ్ పరిస్థితి?:
చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్ (+0.227) పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ, కేవలం గెలుపు మాత్రమే పంజాబ్‌ను నేరుగా ప్లేఆఫ్స్ చేర్చే అవకాశం లేదు. మిగిలిన టీమ్స్ ఫలితాలపై కూడా పంజాబ్ కింగ్స్ ఆధారపడాల్సిందే.
ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్ లెక్కలివే:
లక్నోపై పంజాబ్ గెలిస్తే:
లక్నోపై గెలిస్తే పంజాబ్ 15 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో రేపు వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఖచ్చితంగా ఓడిపోవాల్సి ఉంటుంది. అలాగే, రేపు ఈడెన్ గార్డెన్స్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఒకవేళ గెలిచినా.. రన్ రేట్ పరంగా పంజాబ్‌ను దాటకుండా ఉండాలంటే ఇవాళ లక్నోపై పంజాబ్ భారీ మార్జిన్‌తో గెలవడం చాలా ముఖ్యం. ఈ లెక్కలన్నీ కుదిరితే పంజాబ్ 4వ స్థానంలో నిలిచి.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడుతుంది.
ALSO READ : వరుసగా 6 ఓటములు.. ప్లేఆఫ్స్కి వెళ్లేందుకు పంజాబ్‌కు ఛాన్స్..
మ్యాచ్ రద్దయితే:
లక్నోలో వర్షం పడే ఛాన్స్ లేనప్పటికీ, ఒకవేళ ఏదైనా కారణం వల్ల మ్యాచ్ రద్దయి పాయింట్లు పంచుకుంటే పంజాబ్ 14 పాయింట్లు మాత్రమే వస్తాయి.. ఈ పరిస్థితిలో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇద్దరూ తమ చివరి మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోవాలని పంజాబ్ ఈ దేవుడ్ని ప్రార్థించాల్సి ఉంటుంది.
లక్నో చేతిలో పంజాబ్ ఓడిపోతే:
ఒకవేళ ఈరోజు జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే.. 13 పాయింట్లతోనే నిలిచి ఎలాంటి సమీకరణాలు లేకుండా టోర్నమెంట్ నుంచి అధికారికంగా అవుట్ అవుతుంది.
