వర్క్ ఫ్రం హోమ్ తో.. గ్యాడ్జెట్లకు మస్తు గిరాకీ

వర్క్ ఫ్రం హోమ్ తో.. గ్యాడ్జెట్లకు మస్తు గిరాకీ

పవర్ బ్యాంకులు, వైఫై రూటర్ల అమ్మకాలు పైపైకి

ల్యాప్ ట్యాప్ లు.. పర్సనల్ కంప్యూటర్ల సేల్స్ అప్.. 

బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా సంక్షోభంతో దేశంలో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరిగిన విషయం తెలిసిందే.  దీంతో అప్పటి వరకు ఆఫీసులలోని ఫెసిలిటీస్ను వాడుకొని పనిచేసే ఉద్యోగులు, తమ ఇళ్లల్లోనే అటువంటి ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. చిన్న పట్టణాలలో కూడా ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరిగిందని డేటా చెబుతోంది. వై–ఫై ఎక్సెండర్లు, ల్యాప్టాప్లు, పీసీలు, స్మార్ట్ఫోన్లకు లాక్డౌన్ టైమ్ నుంచి చూస్తే మంచి డిమాండ్ కనిపిస్తోంది. వీటితో పాటు థర్మోమీటర్లు, ఆక్సిమీటర్లు, బీపీ మానిటర్ల వంటి హెల్త్ కేర్  గ్యాడ్జెట్లకు కూడా డిమాండ్ పుంజుకుంది. వై–ఫైను మెరుగుపరిచే ప్రొడక్ట్లను అమ్మే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ హోం ఆఫీస్ ఈ ఏడాది ఏప్రిల్లో లాంచ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ రూ. రెండు కోట్ల విలువైన ప్రొడక్ట్లను అమ్మగలిగింది. నెలవారీగా చూస్తే గత మూడు నెలల్లో కంపెనీ వై–ఫై ప్రొడక్ట్ల గ్రోత్ 50 శాతంగా ఉందని హోం ఆఫీస్ చెబుతోంది. హెడ్ ఫోన్స్ సెగ్మెంట్ 25 శాతం, వెబ్ క్యామ్స్ సెగ్మెంట్ 20 శాతం పెరిగిందని పేర్కొంది. తమ ప్లాట్ఫామ్లో ఇంటెల్, రెసోనేట్ బ్రాండ్లకు చెందిన వై–ఫై ఎక్సెండర్ల ఆర్డర్లు  పెరిగాయని హోం ఆఫీస్ ఫౌండర్ శ్రీకాంత్ ఆచార్య అన్నారు. వీటితో పాటు జేబీఎల్ వంటి బ్రాండ్లకు చెందిన నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్ల అమ్మకాలు పెరిగాయని చెప్పారు. లాక్డౌన్లో కంపెనీ వై–ఫై రూటర్ యూపీఎస్ అమ్మకాలు పెరిగాయని స్టార్టప్ కంపెనీ రెసోనేట్ తెలిపింది. వర్క్ ఫ్రమ్ హోం చేసేటప్పుడు పవర్ బ్యాకప్ ఉండడం అవసరం కాబట్టి ఈ ప్రొడక్ట్ల అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. వీటికి తోడు టెలికాం ప్రొడక్ట్లఅమ్మకాలు పుంజుకోవడానికి కారణమని తెలిపింది.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఫుల్ డిమాండ్ 

 

ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరగడంతో ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు కూడా భారీగా లాభపడ్డాయి.  ఫోన్ యాక్సెసరీస్, స్టడీ ఫ్రమ్ హోం మెటీరియల్స్, స్మార్ట్ డివైజ్లు, కిచెన్, హోం అప్లియెన్సెస్కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని అమెజాన్ చెబుతోంది. వీటితో పాటు ల్యాప్టాప్లు, ట్రిమ్మర్స్ వంటి పర్సనల్ గ్రూమింగ్  ప్రొడక్ట్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.

భారీగా పెరిగిన డిమాండ్

గత ఆరు నెలల్లో  హెడ్ఫోన్స్(141 శాతం), పవర్ బ్యాంక్స్(200 శాతం), ట్యాబ్లెట్స్(400 శాతం), స్పీకర్స్(188 శాతం) కు డిమాండ్ భారీగా పెరిగిందని ఫ్లిప్కార్ట్ తెలిపింది.   మరోవైపు లో, మిడ్ రేంజ్లోని మొబైల్ ఫోన్ల డిమాండ్ కూడా 170 శాతం పెరిగిందని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా రూ. 5,000 కంటే తక్కువ ధర ఉన్న ఫోన్ల కోసం ఎక్కువగా వెతుకుతున్నారని పేర్కొంది. వీటితో పాటు ఐఆర్ థర్మోమీటర్లు(550 శాతం), పల్స్ ఆక్సీమీటర్లు(3255 శాతం) బీపీ మానిటర్లు వంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని ఈ కంపెనీ తెలిపింది.