పనిచేసే ఇంటికి కన్నం ..మహిళ అరెస్ట్.. 60 గ్రాముల గోల్డ్ రికవరీ

పనిచేసే ఇంటికి కన్నం ..మహిళ అరెస్ట్.. 60 గ్రాముల గోల్డ్ రికవరీ

మియాపూర్, వెలుగు: పనిచేసే ఇంటికి కన్నం వేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్​పేట్​లోని ఆదిత్య ఇంపీరియల్​అపార్ట్​మెంట్​లో శ్వేత తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె ఇంట్లో మియాపూర్​న్యూకాలనీకి చెందిన ఓ మహిళ పని మనిషిగా పనిచేస్తుంది.

ఫిబ్రవరి14న ఇంట్లో ఉన్న 60 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ. 4 వేల క్యాష్​ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మియాపూర్​ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసింది పని మనిషిగా గుర్తించారు. ఆమెను అరెస్ట్​ చేసి 60 గ్రాముల బంగారు అభరణాలను రికవరీ చేశారు.