వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకు ముందే భర్త గొంతుకోసింది..బిహార్లో భార్య ఘాతుకం

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కొడుకు ముందే భర్త గొంతుకోసింది..బిహార్లో భార్య ఘాతుకం
  • బిహార్​లోని పూర్ణియా జిల్లాలో ఓ భార్య ఘాతుకం

పాట్నా: బిహార్‌‌‌‌లోని పూర్ణియా జిల్లాలో  దారుణం జరిగింది. 12 ఏండ్ల కొడుకు చూస్తుండగానే ఓ మహిళ తన భర్త గొంతుకోసి చంపేసింది. పోలీసుల ప్రకారం..పూర్ణియా జిల్లా రామ్‌‌‌‌నగర్ గ్రామానికి చెందిన ఉషా దేవి(35), బాలో దాస్ (45) భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాలో దాస్ పంజాబ్ లో కూలీగా పని చేస్తున్నాడు. అయితే, ఉషా దేవి గ్రామంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. 

ఈ క్రమంలో భర్తకు సంబంధించిన ప్లాట్ ను అమ్మేసింది. విషయం తెలుసుకున్న భర్త వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు. తనకు చెప్పకుండా భూమి ఎందుకు అమ్మావంటూ నిలదీశాడు. ఈ విషయంపై దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతున్నది. దీంతో ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ఉషా దేవి నిర్ణయించుకుంది. శనివారం రాత్రి 10:30 గంటలకు బాలో దాస్ గొంతును "డబియా" అనే పదునైన బ్లేడ్‌‌‌‌తో కోసేసింది. 

ఆమె కోసిన వేగానికి రక్తం చిమ్మి నిద్రలో ఉన్న కొడుకుపై పడింది. దాంతో బాలుడు లేచి కేకలు వేసేందుకు ప్రయత్నించగా.. నోరు మూసుకోకపోతే అతన్ని కూడా చంపేస్తానని తల్లి బెదిరించింది. తెల్లవారాక బాలుడు అత్త ఇంటికి వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. 

దీంతో బాలో దాస్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. భర్తను 
తానే హత్య చేసినట్లు ఉష అంగీకరించింది.