మహిళా బిల్లు .. దేశానికే గర్వకారణం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మహిళా బిల్లు .. దేశానికే గర్వకారణం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

హైదరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంపై గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో మహిళలు రాజకీయ రంగంలో ముందుంటారని, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తారని ఆమె తెలిపారు.

మహిళా బిల్లు ఆమోదం.. దేశానికే గర్వకారణమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంలో ఎమ్మెల్సీ కవిత కృషి ఎంతో ఉందన్న మేయర్ .. ఆమెను కలిసి ధన్యవాదాలు తెలిపారు.