విమెన్స్‌‌ టీ20 టోర్నీలో మేఘన మెరిసినా..

విమెన్స్‌‌ టీ20 టోర్నీలో మేఘన మెరిసినా..
  • ట్రయల్ బ్లేజర్స్​కు దొరకని ఫైనల్ బెర్త్
  • టైటిల్‌‌ ఫైట్‌‌కు వెలాసిటీ, సూపర్‌‌నోవాస్‌‌

పుణె: తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (47 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 73) దంచికొట్టినా.. విమెన్స్‌‌ టీ20 చాలెంజ్‌‌ టోర్నీలో ట్రయల్‌‌ బ్లేజర్స్‌‌కు ఫైనల్‌‌ బెర్త్‌‌ దక్కలేదు. గురువారం జరిగిన ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో 16 రన్స్‌‌ తేడాతో వెలాసిటీపై నెగ్గినా.. టైటిల్‌‌ ఫైట్‌‌కు అర్హత సాధించలేకపోయింది. మెరుగైన నెట్‌‌రన్‌‌ రేట్‌‌తో వెలాసిటీ, సూపర్‌‌ నోవాస్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించాయి. మొదట బ్యాటింగ్‌‌లో మేఘనతో పాటు జెమిమా రోడ్రిగ్స్ (44 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 66) రాణించడంతో బ్లేజర్స్ 20 ఓవర్లలో 190/5 భారీ స్కోరు చేసింది. ఫలితంగా ఈ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.
కెప్టెన్‌‌ స్మృతి మంధాన (1) విఫలం కాగా, హీలీ మాథ్యూస్‌‌ (27), సోఫియా డంక్లే (19) ఓ మాదిరిగా ఆడారు. వెలాసిటీ బౌలర్లలో సిమ్రన్‌‌ బహదూర్‌‌కు రెండు వికెట్లు లభించాయి. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో వెలాసిటీ 20 ఓవర్లలో 174/9 స్కోరు చేసి ఓడింది. కిరణ్ నవ్‌‌గిరే (34 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌‌లతో 69) టాప్‌‌ స్కోరర్‌‌. షెఫాలీ వర్మ (29)తో సహా అందరూ నిరాశపర్చారు. బ్లేజర్స్ బౌలర్లలో పూనమ్ యాదవ్ (2/33), రాజేశ్వరి గైక్వాడ్ (2/44) రాణించారు. రోడ్రిగ్స్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.  
సంక్షిప్త స్కోర్లు
ట్రయల్ బ్లేజర్స్: 20 ఓవర్లలో  190/5 (మేఘన 73, రోడ్రిగ్స్ 66, బహదూర్ 2/31).

వెలాసిటీ: 20 ఓవర్లలో 174 /9 (నవ్‌‌గిరే 69, పూనమ్ 2/33, రాజేశ్వరి 2/44).

 

ఇవి కూడా చదవండి

ఇవాళ బెంగళూరు - రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తెలంగాణలో హ్యుందాయ్‌‌‌‌ 1400 కోట్ల పెట్టుబడి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు