ఇవాళ బెంగళూరు - రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇవాళ  బెంగళూరు - రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • కోహ్లి, డుప్లెసిస్పై ఆర్ సీబీ భారం
  • బట్లర్ బాదితేనే రాయల్స్కు భారీ స్కోరు
  • రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో

అహ్మదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: తొలి కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం రెండు అడుగుల దూరంలో బెంగళూరు.. రెండో ట్రోఫీ కోసం అదే రెండు అడుగుల దూరంలో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. కానీ ఇందులో గెలిచేది మాత్రం ఒక్కరే..! మరి ఆ కల నెరవేర్చుకునేది ఎవరు..? అడుగడుగునా ఉత్కంఠ రేపుతున్న ఈ  హై ఓల్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమరం కోసం ఇరుజట్లు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో ఈ రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నెగ్గి.. టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలంగా ఢీకొట్టాలని అటు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, ఇటు రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కా ప్లాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముందుకొస్తున్నాయి. అయితే లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ఈ రెండింటి హిస్టరీ చూస్తే రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుగ్గా కనిపిస్తున్నా.. జట్టు పరంగా ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ బలంగా ఉంది. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో చెరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయంతో సమానంగా ఉన్నాయి. దీంతో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎవరనేది చెప్పడం కష్టంగా మారింది.  
‘బెంగ’తీరేనా?
బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెప్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉన్న బెంగళూరులో స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ల ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేమి ఆందోళన కలిగిస్తున్నది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. స్థిరంగా ఆడటంలో విఫలమవుతున్నారు. లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ వీళ్లు నిరాశపర్చారు. క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లోనూ ఇదే తీరు కొనసాగితే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీని ఆదుకోవడం ఎవరితరం కాదు. అయితే యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటిదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... కీలక సమయంలో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం కొండంత అండగా మారింది.

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అతనిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరాశ ఎదురైనా.. రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అడుగుపెట్టిన పటిదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు. ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి చెలరేగితే రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హసరంగ, హర్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంచి టచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. లక్నో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రీ ఎంట్రీ ఇచ్చిన సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నారు.
బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కడే..
బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంత ప్లస్సో.. టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంత మైనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాడు. ప్రతి ఒక్కరు అతనిపైనే ఎక్కువగా ఆధారపడటంతో రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెప్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరగడం లేదు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదురుకుంటే భారీ స్కోర్లు ఖాయం. కానీ వీళ్లు బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీడలోనే మిగిలిపోతున్నారు. ఒత్తిడిని అధిగమిస్తే ఈ కుర్రాళ్లు అద్భుతం చేస్తారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి ఆరంభం లభిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మల్చలేకపోతున్నాడు.

ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంచనాలు అందుకోవడం లేదు. సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ రాణిస్తుండటం సానుకూలాంశం. క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో తేలిపోయిన బౌలర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. దానిని ఎలా అధిగమిస్తారన్నదే అతిపెద్ద ప్రశ్న. పేసర్లలో బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసీధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణకు తిరుగులేదు. ఒబేద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకే మాత్రం గాడిలో పడాలి. స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వయం అశ్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పని చేయాలి. 
జట్ల అంచనా
బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, పటిదార్, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్, లోమ్రోర్, కార్తీక్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్, సిరాజ్
రాజస్తాన్: జైస్వాల్, బట్లర్, శాంసన్ (కెప్టెన్), పడిక్కల్, రవి అశ్విన్, హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మయర్, రియాన్ పరాగ్, బౌల్ట్, ప్రసిధ్, చహల్, ఒబెద్ మెకే / కుల్దీప్ సేన్.

 

ఇవి కూడా చదవండి

తెలంగాణలో హ్యుందాయ్‌‌‌‌ 1400 కోట్ల పెట్టుబడి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు