రాష్ట్రంలో హ్యుందాయ్‌‌‌‌ 1400 కోట్ల పెట్టుబడి

రాష్ట్రంలో హ్యుందాయ్‌‌‌‌ 1400 కోట్ల పెట్టుబడి
  • మొబిలిటీ క్లస్టర్లలో పెట్టుబడులు పెడతామని సంస్థ సీఈవో ప్రకటన
  • మరో రెండు కంపెనీలు కూడా పెట్టుబడులపై ఆసక్తి
  • దావోస్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో ఆయా కంపెనీల ప్రతినిధుల భేటీ
  • హ్యుందాయ్‌‌‌‌ పెట్టుబడుల నిర్ణయంపై మంత్రి హర్షం

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌‌‌‌ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దావోస్‌‌‌‌లో మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో సమావేశమైన హ్యుందాయ్‌‌‌‌ సీఈవో యాంగ్చోచి పెట్టుబడులపై ప్రకటన చేశారు. అలాగే ఈఎంపీఈ డయాగ్నస్టిక్‌‌‌‌, జీఎంఎం ఫాడ్లర్‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వెల్లడించాయి. మొబిలిటీ క్లస్టర్లలో పెట్టుబడులు పెడతామని హ్యుందాయ్ సీఈవో యాంగ్చో చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండటంతోపాటు టెస్ట్ ట్రాక్‌‌‌‌లు, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హ్యుందాయ్‌‌‌‌ నిర్ణయంపై మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రానికి గొప్ప బలాన్నిస్తుందని, హ్యుందాయ్‌‌‌‌కి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. దేశంలో ఇన్నొవేషన్ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలకు మాత్రమే ఇన్నోవేషన్ పరిమితం కాకుండా మానవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారాలు ఇవ్వగలిగేలా ఉండాలన్నారు. ఇన్నోవేట్, ఇంక్యుబేట్, ఇన్‌‌‌‌కార్పొరేట్‌‌‌‌ ఈ మూడు ‘ఐ’లే దీనికి మార్గమని చెప్పారు. 
క్షయ వ్యాధి నివారణ కిట్ల కేంద్రం..
క్షయ వ్యాధి డయాగ్నస్టిక్ కిట్లను తయారు చేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదరాబాద్‌‌‌‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఈఎంపీఈ డయాగ్నస్టిక్ ప్రకటించింది. రూ.25 కోట్లతో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ కిట్లను తయారు చేస్తామని తెలిపింది. ఐదు దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాత హైదరాబాద్‌‌‌‌ను ఎంచుకున్నట్లు తెలిపింది. దీంతో అదనంగా మరో రూ.50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపింది. సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్‌‌‌‌‌‌‌‌ పవన్ అసలాపురం దావోస్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో 
భేటీ అయ్యారు. 
గ్లాస్-లైన్ పరికరాల తయారీ విస్తరణ
ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్‌‌‌‌లను తయారు చేసే జీఎంఎం ఫాడ్లర్.. హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా దాదాపు రూ.29 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో థామస్ కెహ్ల్ దావోస్‌‌‌‌లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌తో సమావేశమై దీనిపై  ప్రకటన చేశారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 2020, మార్చి 2022 మధ్య హైదరాబాద్ కేంద్రం ద్వారా700 పరికరాలను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కంపెనీ తెలిపింది.

 

ఇవి కూడా చదవండి

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు

వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం

కరోనా టైంలో ప్రపంచానికి మన సత్తా తెలిసింది

దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు