ఆగని యుద్ధం.. ఆల్ టైం హైలో రూపాయి.. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు 8 లక్షల కోట్ల నష్టం

ఆగని యుద్ధం.. ఆల్ టైం హైలో రూపాయి.. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు 8 లక్షల కోట్ల నష్టం
  • కొనసాగుతున్న మార్కెట్ పతనం.. సెన్సెక్స్ 1,123 పాయింట్లు డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • గత మూడు సెషన్లలో 4 శాతం పడిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ
  • దాదాపు రూ.21 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

న్యూఢిల్లీ:  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్లడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాత్ కొనసాగుతోంది. రోజురోజుకూ ఇన్వెస్టర్లు రూ.లక్షల కోట్లు నష్టపోతున్నారు. అమెరికా– ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యుద్ధం తీవ్రమవడంతో   బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు బుధవారం ఒకటిన్నర శాతం  పడ్డాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో  4 శాతం నష్టపోయాయి. ఇన్వెస్టర్లు ఒక్క బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  దాదాపు రూ.8 లక్షల కోట్లు నష్టపోగా, గత మూడు సెషన్లలో రూ.21 లక్షల కోట్లు కోల్పోయారు.  

యుద్ధం 4–5 వారాలు కొనసాగుతుందని  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్  ప్రకటించడంతో  ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. 50 రోజులకు సరిపడా క్రూడాయిల్ స్టాక్స్ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ బుధవారం  1,123 పాయింట్లు (1.40శాతం) తగ్గి 79,116.19 వద్ద ముగియగా,  నిఫ్టీ 385.20 పాయింట్లు (1.55శాతం) నష్టపోయి  24,480.50 వద్ద సెటిల్ అయింది. నిఫ్టీ ఇంట్రాడేలో 24,300 వరకు జారింది. చివరి గంటలో  ఐటీ షేర్లలో బయ్యింగ్ రావడంతో కొంత కోలుకుంది.  

మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్, స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 2శాతం చొప్పున పడ్డాయి.  క్రూడాయిల్‌  ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌ షేర్లు 5 శాతం వరకు నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్‌, బెర్జర్ పెయింట్స్‌, ఇండిగో పెయింట్స్‌, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా 2.5 శాతం వరకు పడ్డాయి. ఐటీ   తప్ప మిగిలిన సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగిశాయి.  నిఫ్టీ  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రా, పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్, రియల్టీ, మీడియా, ఆయిల్ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  గ్యాస్, ఆటో, మెటల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  2–4శాతం వరకు  క్రాష్ అయ్యాయి.  700 కి పైగా  స్టాక్స్ 52- వారాల కనిష్టానికి జారుకున్నాయి. 

ఎనలిస్టులు ఏమంటున్నారు?

‘‘ఒక్కసారిగా సెల్లింగ్ రావడంతో నిఫ్టీ 24,300–24,100 సపోర్ట్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. గ్యాప్-డౌన్ ఓపెనింగ్ తర్వాత రికవరీకి ప్రయత్నాలు జరిగాయి. గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. బుల్స్ రిలీఫ్ ర్యాలీ కోసం ప్రయత్నిస్తున్నారు.  సపోర్ట్ 24,300–-24,100 వద్ద, రెసిస్టెన్స్ 24,600 వద్ద ఉంది”అని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీ టెక్నికల్ ఎనలిస్ట్  నాగరాజ్ శెట్టి  తెలిపారు. 


‘‘ మెటల్ ఇండెక్స్ 4శాతం పడింది. నిఫ్టీ  24,300 నుంచి 24,600 రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రేడ్ అయింది. షార్ట్-టర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నా,  ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోల్డ్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. సపోర్ట్ 24,300 దగ్గర, రెసిస్టెన్స్ 24,600 వద్ద ఉంది.  రెసిస్టెన్స్ లెవెల్ దాటితే  24,800–25,000 వరకు,   సపోర్ట్ కోల్పోతే  24,100–24,000 వరకు కదలొచ్చు. వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది”అని కోటక్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్  శ్రీకాంత్ చౌహాన్  వివరించారు. కాగా, ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే వోలటాలిటీ ఇండెక్స్ నిఫ్టీ విక్స్ బుధవారం 23 శాతం పెరిగి 21.14 కి చేరింది.

రూపాయి.. ఆల్‌ టైం లో

స్టాక్ మార్కెటే కాదు రూపాయి కూడా వరుస సెషన్లలో క్షీణిస్తోంది.  డాలర్‌‌తో మొదటిసారిగా 92 లెవెల్‌ను దాటి  బుధవారం ఆల్‌ టైమ్‌ లోని నమోదు చేసింది.  రూపాయి విలువ 56 పైసలు బలహీనపడి    92.05 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 92.35 వరకు కూడా జారింది. అమెరికా ఇరాన్‌పై  కిందటి నెల 28న దాడులు ప్రారంభించగా అంతకుముందు రోజు రూపాయి 91.08 దగ్గర ఉంది. బుధవారం నాటికి దాదాపు100 పైసలు నష్టపోయింది. ఇది సుమారు 1.1–1.2 శాతానికి సమానం.    

ఇరాన్ సంక్షోభం వల్ల బ్రెంట్‌ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 82 డాలర్లకు చేరాయి. దీంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) ఇండియా మార్కెట్ నుంచి వెళ్లిపోతుండడంతో మన కరెన్సీ క్షీణిస్తోంది.  ఎఫ్ఐఐలు బుధవారం నికరంగా రూ.8,752 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. రూపాయి  సోమవారం 41 పైసలు తగ్గి 91.49 వద్ద ముగిసింది.