పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు

పోలీసు ఉద్యోగాలకు 8.30 లక్షల మంది దరఖాస్తు
  • పోలీస్​ జాబులకు 12.9 లక్షల అప్లికేషన్లు
  • మొత్తం అభ్యర్థులు 7.30 లక్షల మంది
  • యూనిఫామ్ పోస్టులకు భారీగా పెరిగిన డిమాండ్
  • మల్టిపుల్ పోస్టులకు 48శాతంకు పైగా దరఖాస్తులు
  • ఆగస్టు 7న ఎస్ఐ, అదేనెల 21న కానిస్టేబుల్ పరీక్షలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఖాకీ యూనిఫామ్‌‌‌‌ కోసం రాష్ట్ర యువత పెద్ద ఎత్తున పోటీ పడుతోంది. నాలుగేండ్ల తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్స్‌‌‌‌ రావడంతో పోలీస్‌‌‌‌ కొలువు కొట్టేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ స్టేట్‌‌‌‌ లెవల్‌‌‌‌ పోలీస్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు(టీఎస్‌‌‌‌ఎల్‌‌‌‌పీఆర్‌‌‌‌‌‌‌‌బీ) ద్వారా 17,516 పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2 నుంచి మొదలైన అప్లికేషన్ ప్రక్రియ గురువారం రాత్రి 10 గంటలకు ముగిసింది. రాత్రి 7 గంటల వరకు 7 లక్షల 30 వేల మంది అభ్యర్థుల నుంచి 12 లక్షల 90 వేల అప్లికేషన్స్ వచ్చినట్లు బోర్డ్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వీవీ శ్రీనివాస్‌‌‌‌రావు తెలిపారు. డేటాను సెంట్రలైజ్‌‌‌‌ చేసిన తర్వాత కేటగిరీల వారీగా పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామన్నారు. కాగా, ఆగస్టు 7న ఎస్ఐ ఎగ్జామ్, అదే నెల 21న కానిస్టేబుల్​ పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు.
కానిస్టేబుల్​ పోస్టులకు 8 లక్షల అప్లికేషన్లు 
గతంలో ఎన్నడూ లేనివిధంగా యూనిఫామ్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌కు డిమాండ్‌‌‌‌ పెరిగింది. ఎస్ఐ, కానిస్టేబుల్‌‌‌‌ పోస్టులకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సుమారు 8 లక్షల మంది కానిస్టేబుల్‌‌‌‌ పోస్టులకు అప్లై చేశారు. ఈ క్రమంలోనే 48% మంది ఒక పోస్ట్‌‌‌‌కు, 29% మంది రెండు, 18% మంది మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.5% మంది మాత్రమే నాలుగు పోస్టులకు,1 శాతం మంది 5 పోస్టులకు అప్లై చేసుకున్నట్లు బోర్డు అధికారుల అంచనా. దరఖాస్తు చేసుకున్న వారిలో రాష్ట్రానికి చెందిన వారు 98 శాతం ఉండగా మిగిలిన 2 శాతం కర్నాటక, ఏపీ నుంచి అప్లై చేశారు. మొత్తం 68% మంది తెలుగులో పరీక్ష రాస్తామని, 32% మంది ఇంగ్లి‌‌‌‌ష్‌‌‌‌, 0.1 శాతం మంది ఉర్దూలో పరీక్ష రాస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం నుంచి 28 శాతానికి పైగా అప్లికేషన్స్‌‌‌‌ వచ్చాయి. ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌‌‌‌, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాల నుంచి 1 శాతం మందే అప్లై చేశారు.
మహిళా అభ్యర్థులు 3 లక్షలు
సివిల్‌‌‌‌, ఏఆర్‌‌‌‌‌‌‌‌ ఎస్ఐ, కానిస్టేబుల్‌‌‌‌,  జైల్‌‌‌‌ వార్డర్స్‌‌‌‌ కోసం మహిళలు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. రిజర్వేషన్ల ప్రకారం ఎస్ఐ పోస్టుల్లో 25% అంటే 150 నుంచి 170 వరకు, సివిల్‌‌‌‌, ఏఆర్‌‌‌‌ కానిస్టేబుల్ పోస్టుల్లో 2,420 పోస్టులకు మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా అభ్యర్థుల నుంచి 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అన్ని కేటగిరీల్లో 54% బీసీ, 40% ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, 6 శాతం ఓసీ అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తం

కరోనా టైంలో ప్రపంచానికి మన సత్తా తెలిసింది

దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు