హైదరాబాద్ సిటీ, వెలుగు : రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూల్స్ లో 2026–-2027 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఇన్ చార్జి జిల్లా యువజన క్రీడల అధికారి ఏఎన్ కే గోకుల్ ఓ ప్రకటనలో తెలిపారు.
హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో ఉన్న క్రీడా పాఠశాలలకు మూడు అంచెల్లో ఎంపిక విధానం ఉంటుందన్నారు. 30 మీటర్ల ప్రయింగ్ స్టార్ట్, 6x10 మీటర్ల షటిల్ రన్, స్టాండింగ్ బోర్డ్ జంప్ , వర్టికల్జంప్, ఫ్లెక్సిబిలిటీ, మెడిసిన్ బాల్ త్రో, 800 మీటర్ల రన్ పోటీలతో పాటు బరువు, ఎత్తు, వైద్య పరీక్షల ఆధారంగా సెలక్షన్స్ఉంటాయని వివరించారు.
మండల స్థాయిలో ఈ నెల 13 నుంచి 17 వరకు, జిల్లా స్థాయిలో ఈ నెల 28 నుంచి 1 ఏప్రిల్ వరకు, రాష్ట్ర స్థాయిలో 27 ఏప్రిల్ నుంచి 1 మే వరకు సెలెక్షన్స్ఉంటాయన్నారు. హకీంపేటలో బాయ్స్‌కు 20, గర్ల్స్‌కు 20 సీట్లు ఉన్నాయన్నారు. ముందు ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మొబైల్ నుంచి tgss.telangana.gov.in వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
