పూటపూటకు ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ లను  మార్చడమేంది? రేవంత్‌‌‌‌ కు పాలనపై పట్టు రావట్లే: హరీశ్‌‌‌‌రావు

పూటపూటకు ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ లను  మార్చడమేంది? రేవంత్‌‌‌‌ కు పాలనపై పట్టు రావట్లే: హరీశ్‌‌‌‌రావు
  • సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్‌‌‌‌వోడీలను మారుస్తున్నరు
  • పెట్టుమన్న చోట సంతకాలు పెట్టనందుకే అధికారుల బదిలీలు
  • కలెక్టర్లను ఒక జిల్లాలో కనీసం రెండేండ్లు ఉంచాలి.. అప్పుడే పట్టు వస్తది
  • నియోపొలిస్‌‌‌‌లో రేవంత్​ మేనల్లుడి అనుచరులకు అక్రమ మైనింగ్‌‌‌‌ అనుమతులు.. 
  • మొబైల్​క్రషర్‌‌‌‌‌‌‌‌ కు అనుమతిస్తే.. ఫిక్స్డ్‌‌‌‌ క్రషర్​ పెట్టారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూటపూటకూ ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌లను మార్చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5 సార్లు ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌ల బదిలీలు చేపట్టారని తెలిపారు.  సగటున 6 నుంచి 8 నెలలకోసారి హెచ్‌‌‌‌వోడీలను  మారుస్తున్నారని, దీనివల్ల పాలన కుంటుపడుతున్నదని అన్నారు. రేవంత్‌‌‌‌కు రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని తెలంగాణభవన్‌‌‌‌లో హరీశ్‌‌‌‌రావు మీడియాతో చిట్​చాట్​ చేశారు. 

విద్యుత్​ శాఖలో రెండేండ్లలోనే ఐదుగురు అధికారులను మార్చడంతో.. ఆ శాఖ అతలాకుతలమైందని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. సింగరేణి, జీహెచ్ఎంసీ, ఐ అండ్​ పీఆర్​, స్కూల్​ ఎడ్యుకేషన్​, పంచాయతీరాజ్​ శాఖల్లో నలుగురు చొప్పున అధికారులను బదిలీ చేశారని పేర్కొన్నారు. మున్సిపల్​శాఖలో ఐదుగురిని, మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరుగురిని, ఐటీ, నేషనల్​ హెల్త్​ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు చొప్పున అధికారులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్​ చేశారన్నారు. 

అత్యంత కీలకమైన ఆరోగ్య శ్రీ విభాగంలో ఏకంగా 8 మందిని మార్చేశారని తెలిపారు. పెట్టుమన్న చోట సంతకాలు పెట్టనందుకు, ప్రభుత్వ అవినీతికి సహకరించనందుకే అధికారులను ఇష్టమొచ్చినట్టు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్​ చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు నచ్చకపోయినా, మంత్రులకు నచ్చకపోయినా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్లు కామన్​ అయిపోయాయన్నారు. కలెక్టర్లను సీఎం బ్లాక్​మెయిల్​ చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, తీరు మార్చుకోవాలని వ్యాఖ్యానించారు.

యంగ్​ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల స్థైర్యం దెబ్బతింటది

రెండేండ్లలో 140 మంది ఐఏఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను బదిలీ చేస్తే.. 20 మంది కలెక్టర్లను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్​చేశారని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తెలిపారు.  ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పటిదాకా నలుగురు కలెక్టర్లను మార్చారన్నారు. ‘‘ఇట్లా మార్చుకుంటూపోతే జిల్లాపైనా,ఆయా శాఖపైన  అధికారులు అవగాహన ఎప్పుడు వస్తుంది.. పనులు ఎలా జరుగుతాయి? కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జిల్లాపై అవగాహన రావడానికే 6 నెలలు పడుతుంది. ఈ లోపే ఎంతోమంది కలెక్టర్లను ప్రభుత్వం మార్చేసింది. దీని వల్ల యువ కలెక్టర్ల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కలెక్టర్లు కనీసం రెండేండ్లు ఒకేచోట ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి’’ అని తెలిపారు. 

వికారాబాద్​ కలెక్టర్​ ప్రతీక్​ జైన్​లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారన్నారు. సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే బోలెడన్ని బాధ్యతలుంటాయని, అలాంటి అధికారికి ఐటీ సెక్రటరీగా బాధ్యతలు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలో అధికారులకు ఎక్స్​టెన్షన్​ ఇస్తే.. కాంగ్రెస్​ నేతలు విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు ఆ కాంగ్రెస్​ ప్రభుత్వమే వందలాది మంది అధికారులకు ఎక్స్​టెన్షన్లు ఇస్తున్నదని విమర్శించారు.   

నియోపొలిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమ మైనింగ్​

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనల్లుడి మనుషులు నియోపొలిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్రమ మైనింగ్​చేస్తున్నారని హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. అక్కడ మొబైల్​ క్రషింగ్​ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే అనుమతులిచ్చినా.. ఫిక్స్డ్​ క్రషింగ్​ప్లాంట్​ పెట్టారన్నారు. ల్యాండ్​ లీజుకిస్తే 6 నుంచి 7 శాతం వరకు ఫీజు కట్టాలని, కానీ, వాళ్లకు మాత్రం ఫ్రీగా కట్టబెట్టేశారని ఆరోపించారు. ‘‘పది ఎకరాలే ఇచ్చినా.. 15 ఎకరాల్లో మైనింగ్​ చేస్తున్నారు. రెడీమిక్స్​ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుమతి లేకున్నా ఐదారు ప్లాంట్లు పెట్టి నడిపిస్తున్నారు. 

పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు ఎమ్మెల్యే మైనింగ్​కంపెనీకి పదింతల పెనాల్టీ వేశారని, మరి రేవంత్​మేనల్లుడి క్రషర్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూ పెనాల్టీ వేస్తారా?’’ అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ అనుమతులు లేకుండా రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మైనింగ్ దందా నడుపుతున్నదని చెప్పారు.