టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ (Meher Ramesh) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మెహర్ జ్యోతి వైరల్ న్యుమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ జూలై 21 రాత్రి విజయవాడలో తుది శ్వాస విడిచారని మెహర్ రమేష్ తెలిపారు. ఈ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే జూలై 1న మెహర్ రమేష్ కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుకకు మెహర్ జ్యోతి హాజరై, కుటుంబ సభ్యులందరితో ఎంతో సంతోషంగా గడిపారు. ఈ క్రమంలోనే మెహర్ రమేష్ కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడం అందరినీ కలచివేసింది.
ఈ సందర్భంగా మెహర్ రమేష్ తన ట్వీట్‌లో, ‘‘నా ప్రియమైన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర ఈ రోజు రాత్రి 9:45 గంటలకు విజయవాడలో కన్నుమూశారు. వైరల్ న్యుమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. నా చిన్నప్పటి నుంచి తను నాకు అండగా నిలిచింది. ఎంతో ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించింది. అనంతరం శ్రీ వెంకటేశ్వరస్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడింది. ఇప్పుడు మా అక్క ఇంత తొందరగా దేవుడి దగ్గరకు వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు’’ అంటూ మెహర్ తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ALSO READ : నాలుగేళ్ల విరామం తర్వాత.. పూజా మేరీ జాన్
నా ప్రియమైన చిన్నక్క "మెహెర్ జ్యోతి సుంకర "
— Meher Raamesh (@MeherRamesh) July 21, 2026
ఈ రోజు 9:45 pm కి విజయవాడ లో స్వర్గస్తులైనారు. వైరల్ న్యూమోనియా తో గత 14 రోజులు గా చికిత్స పొందుతూ అనంత లోకాలకి వెళ్లి పోయారు. నా చిన్నప్పటి నుండి తను నా అండ ,ప్రేమ గా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి ,శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల… pic.twitter.com/WEPku2Kj1W
టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మెహర్ రమేష్ ఒకరు. ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి సినిమాలతో పాటుగా ప్రభాస్తో 'బిల్లా', వెంకటేష్తో 'షాడో, చిరంజీవితో 'భోళా శంకర్'మూవీస్ తెరకెక్కించాడు.
