‘లెనిన్’ సినిమాతో టాలీవుడ్‌లో తొలి విజయాన్ని అందుకున్న భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు మాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆపరేషన్ గంగా’ చిత్రంతో ఆమె మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. శనివారం ఈ సినిమాను అనౌన్స్ చేశారు.
ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. జాతీయ అవార్డు గ్రహీత విష్ణు మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు ప్రకటించారు. కథకు ఎంతో కీలకమైన పాత్రను తాను పోషిస్తోందని, తన క్యారెక్టర్‌లోని ట్విస్ట్‌లు సర్‌ప్రైజ్ చేస్తాయని సమాచారం.
రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను కాపాడేందుకు మన దేశం చేపట్టిన సీక్రెట్ మిషన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్, పార్తిబన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తోంది. జార్జియాలో ఇప్పటికే షూటింగ్ మొదలవగా త్వరలో మోహన్‌లాల్ జాయిన్ అవనున్నారు. పోలాండ్, జార్జియా, కజకిస్థాన్, ఢిల్లీ, డెహ్రాడూన్, కొచ్చి ప్రాంతాల్లో ఆరు నెలల పాటు షూటింగ్ జరగనుంది.
