హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌లో రంగు మారి కలుషితంగా కనిపిస్తున్న నీటి శాంపిళ్లను అధికారులు సేకరించారు. వెలుగు దినపత్రికలో శనివారం వచ్చిన కథనంపై ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు.
నీళ్లు రంగు మారిన ప్రాంతాన్ని ఎన్నెస్పీ ఎస్ఈ మల్లికార్జునరావు శనివారం పరిశీలించారు. నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారులు బ్యాక్ వాటర్ నీటి నమూనాలు సేకరించారు. శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించనున్నట్లు ఎస్ఈ తెలిపారు.
నివేదిక వచ్చిన అనంతరం నీటి రంగు మారడానికి గల కారణం ఏమిటనేది స్పష్టం అవుతుందని అధికారులు వెల్లడించారు. నీళ్లు కలుషితంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
