పెద్ద యూనివర్శిటీ.. సిబ్బంది కొరత..కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో మెడికోల తిప్పలు

పెద్ద యూనివర్శిటీ.. సిబ్బంది కొరత..కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో  మెడికోల తిప్పలు

వరంగల్​ సిటీ, వెలుగు: వరంగల్​ కాళోజీ నారాయణరావు హెల్త్​ యూనివర్శిటీలో శనివారం మెడికోలు సర్టిఫికెట్ల కోసం తిప్పలు పడ్డారు. ఎంబీబీఎస్  ఫైనల్  ఇయర్  పాసైన మెడికోలు స్లాట్  బుక్  చేసుకోగా, శనివారం అపాయింట్​మెంట్  వచ్చింది. దీంతో పూణే, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాల నుంచి 200 మంది మెడికోలు పేరెంట్స్​తో కలిసి ఉదయం యూనివర్సిటీకి చేరుకున్నారు.

 అయితే సర్టిఫికెట్లపై సంతకాలు కాలేదని చెబుతూ మెడికోలను ఆఫీస్​ చుట్టూ తిప్పించుకున్నారు. సిబ్బంది కొరత ఉందని, నలుగురు స్టాఫ్‌‌‌‌‌‌‌‌తోనే పనులు చూసుకోవాల్సి వస్తోందని అధికారులు చేతులెత్తేశారు. కొంత ఆలస్యంగా సర్టిఫికెట్లు అందజేశారు. ఇంత పెద్ద యూనివర్సిటీలో ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని పేరెంట్స్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.