ఈ ఏడాది ఇప్పటికే తెలుగు చిత్రం ‘డెకాయిట్’తో పాటు మరో రెండు హిందీ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన మృణాల్ ఠాకూర్.. తాజాగా మరో సినిమాతో జనం ముందుకొస్తోంది. మృణాల్, హ్యూమా ఖురేషి, విక్రమ్ సింగ్ చౌహాన్ లీడ్ రోల్స్‌లో రూపొందిన హిందీ చిత్రం ‘పూజా మేరీ జాన్’. నవజోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నిర్మించింది.
2022లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం.. ఓటీటీ డీల్‌లో ఇబ్బందులు, మేకర్స్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్‌తో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తోంది. అదికూడా థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
ఈ సినిమా త్వరలో తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందని జీ5 సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియాలో తనను మారుపేర్లతో వేధిస్తున్న ఓ సైకోను పూజా అనే అమ్మాయి ఏం చేసింది, ఈ ప్రయత్నంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేది ఈ చిత్ర కథాంశం. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
