సింధు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన మురళీ మోహన్

సింధు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను సందర్శించిన మురళీ మోహన్

హైదరాబాద్, వెలుగు: ఇటీవల పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీ మోహన్ హైదరాబాద్ హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీలోని సింధు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలు, మౌలిక వసతులను పరిశీలించి, సంస్థ అందిస్తున్న వైద్య సేవలు, సేవా కార్యక్రమాలను అభినందించారు.

క్యాన్సర్ చికిత్సతో పాటు 30కుపైగా మల్టీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.