అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె.. స్వాధీనం చేసుకున్న బోయినపల్లి పోలీసులు

అటవీ ప్రాంతంలో  మనిషి పుర్రె.. స్వాధీనం చేసుకున్న బోయినపల్లి పోలీసులు

పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్​ డెయిరీ ఫామ్ రోడ్డులోని అటవీ ప్రాంతంలో మనిషి పుర్రె కలకలం రేపింది. సోమవారం కనాజిగూడకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి అటుగా వెళ్తుండగా పుర్రె, ఎముకలు కనిపించాయి. డయల్​ 100కు ఫోన్​ చేయడంతో బోయిన్‌‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వాటిని పరిశీలించారు. గాంధీ హాస్పిటల్​కు తరలించి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.