నెక్కొండ, వెలుగు: ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్జిల్లా నెక్కొండ ఎస్సై మహేందర్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ శ్వేతారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గాడుదుల వెంకన్న సివిల్ మ్యాటర్లో తలదూర్చి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తానని ఎస్సై బెదిరించాడు. దీంతో వెంకన్న ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
ఒక వర్గం వారికి ఎస్సై వత్తాసు పలుకుతూ మరో వర్గం వారిపై తప్పుడు కేసులు పెడుతున్నాడని పలువురు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై విచారణ జరిపగా, వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశారు. ఎస్సై సస్పెండ్ కావడంతో నెక్కొండ మండల ప్రజలు మంగళవారం అంబేద్కర్ సెంటర్లో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సీపీ శ్వేతారెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
