హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో బుధవారం 13 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సెకండియర్ మ్యాథ్స్-–2ఎ , బాటనీ-–2, పొలిటికల్ సైన్స్–-2 పరీక్షల్లో 13 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ దొరికారని ఇంటర్బోర్టు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
కాగా, పరీక్షల పర్యవేక్షణ కోసం ఇంటర్ బోర్డు నియమించిన స్పెషల్ అబ్జర్వర్లు వనపర్తి, యాదాద్రి, సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించారు. బుధవారం జరిగిన పరీక్షలకు 4,72,872 మంది విద్యార్థులకు గాను 4,59,835(97.24%) మంది హాజరైనట్లు ఇంటర్బోర్టు సెక్రటరీ పేర్కొన్నారు.
