గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ

గోదావరి పుష్కరాలపై కేబినెట్ సబ్ కమిటీ

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 9 మంది సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కమిటీకి చైర్మన్​గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉంటారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డిని నియమించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవసరమైనప్పుడు సమావేశాలకు ఆహ్వానించనున్నారు. రెవెన్యూ (దేవా దాయ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్‌‌‌‌గా వ్యవహరిస్తారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భక్తుల సౌకర్యాలపై ఈ కమిటీ స్టడీ చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది.