బషీర్బాగ్, వెలుగు: ఆద్యకళ సంస్థ, సాలార్జంగ్ మ్యూజియం, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాలార్జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఒకే వేదికపై జానపద, గిరిజన కళాకారులు, స్టూడెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించారు.
అంతరించిపోతున్న విభిన్న కళలను నేటి తరానికి తెలియజెప్పేందుకు ఈ కచేరీ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 350 సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు. ఆద్యకళ సంస్థ ప్రతినిధి మనోజా అధ్యక్షత వహించిన ఈ కచేరీకి తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ రమేశ్ భట్టు, వీసీ కిషన్ రావు, సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానపద, గిరిజన కళాకారులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
