రెజ్లర్ గీతా ఫొగట్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన భర్త పవన్ కుమార్, క్యూట్ బేబీ ఫొటో పెట్టి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిందామె. రెజ్లర్ పవన్ కుమార్ తో 2016 నవంబరు 20న గీతా ఫొగట్ వివాహమైంది. వీరికి నిన్న (డిసెంబరు 24న) తొలి సంతానం కలిగిన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
‘హలో బాయ్!! వెల్కం టూ ద వరల్డ్. మా ప్రేమకు ప్రతిరూపం. మా చిట్టికన్న ఇదిగో. మీ అందరి ప్రేమ, ఆశీస్సులను వీడికి అందించండి. మా జీవితాన్ని వీడి పరిపూర్ణం చేశాడు. బిడ్డకు జన్మనివ్వడం అనే ఫీలింగ్ మాటల్లో చెప్పలేని ఫీలింగ్. ఇది మీరు అనుభూతి పొందితేనే అర్థమవుతుంది’ అంటూ గీతా తమ ఫొటోను షేర్ చేశారు.
గీతా ఫొగట్ ఈ న్యూస్ షేర్ చేయగానే ఆమెకు కంగ్రాట్ చెప్పారు చాలామంది అభిమానులు, సెలబ్రెటీలు. క్యూట్ బేబీని బ్లెస్ చేశారు. గీతా సోదరి బబితా ఫొగట్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసి.. కంగ్రాట్స్ చెప్పింది. ఈ బుడ్డోడి రాకతో నీ జీవితం మరింత ఆనందంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు.

