సీఎం యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

సీఎం యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాణించే హెలికాప్టర్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వారణాసి నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ కిటికీని పక్షి ఢీకొట్టింది. వెంటనే పైలట్ అప్రమత్తమయ్యారు.  అత్యవసరంగా హెలికాప్టర్ ను వారణాసి పోలీస్ లైన్స్ గ్రౌండ్ లో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. తర్వాత వారణాసి నుంచి లక్నోకు ప్రభుత్వ విమానంలో యోగి ఆదిద్యనాథ్ లక్నోకు వెళ్లిపోయారు. శనివారం వారణాసికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్ నగరంలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి సమీక్షా సమావేశం నిర్వహించారు.