కొత్త మెషీన్‌‌‌‌ : అరబకెట్‌ నీళ్లతో 15 నిమిషాల్లో బట్టలు ఉతికేయొచ్చు

కొత్త మెషీన్‌‌‌‌ : అరబకెట్‌ నీళ్లతో 15 నిమిషాల్లో బట్టలు ఉతికేయొచ్చు
  • కొత్త మెషీన్‌‌‌‌ను రెడీ చేసిన బ్రిటిష్‌ ఇండియన్‌‌‌‌
  • అరబకెట్‌ నీటితో 15 నిమిషాల్లో ఉతికేయొచ్చు
  • ఐడియా ఇచ్చిన సౌతిండియా మహిళ దివ్య పేరే మెషీన్‌‌‌‌కు..

తనో బ్రిటిష్‌‌‌‌ ఇండియన్‌‌‌‌. లండన్‌‌‌‌లో ఉంటున్నాడు. పేరు నవ్‌‌‌‌ సహానీ. 29 ఏళ్లు. ఇంజనీరింగ్‌‌‌‌ చేశాడు. యూనివర్సిటీ ఆఫ్‌‌‌‌ బాత్స్‌‌‌‌లో హ్యూమానిటేరియనిజం, కాన్‌‌‌‌ఫ్లిక్ట్‌‌‌‌, డెవపల్‌‌‌‌మెంట్‌‌‌‌లో ఎమ్మెస్సీ చేస్తున్నాడు. ఆ మధ్య దక్షిణ ఇండియాలోని దివ్య అనే మహిళ ‘ బాబు.. చేతితో బట్టలు ఉతకడానికి మేం చాలా కష్టపడాల్సి వస్తోంది. టైమంతా దానికే పోతోంది. పైగా నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు’ అని తన బాధను చెప్పుకుంది. ఆ మహిళ చెప్పిన మాటలను సీరియస్‌‌‌‌గా తీసుకున్న నవ్‌‌‌‌.. ఏదైనా చేయాలనుకున్నాడు. స్వతహాగా ఇంజనీరైన తను.. బాగా ఆలోచించి అద్భుతమైన వాషింగ్‌‌‌‌ మెషీన్‌‌‌‌ను కనిపెట్టాడు. చేతితో బట్టలు ఉతకకుండా జస్ట్‌‌‌‌ చేతితో తిప్పేలా దాన్ని డిజైన్‌‌‌‌ చేశాడు. దానికి గోడు వెళ్లబోసుకున్న ‘దివ్య’ పేరే పెట్టాడు. మెషీన్‌‌‌‌ కెపాసిటీ 5 కిలోలు. ఒక్కసారి బట్టలు ఉతకడానికి 10 లీటర్ల నీళ్లు (సగం బకెట్‌) అవసరం. అదే మామూలు ఎలక్ట్రిక్‌‌‌‌ వాషింగ్‌‌‌‌ మెషీన్లు 30 లీటర్ల వరకు తీసుకుంటాయి. మెషీన్‌‌‌‌లో వాష్‌‌‌‌, క్లీన్‌‌‌‌, డ్రై దశలున్నాయి. అన్నీ 15 నిమిషాల్లోనే పూర్తయిపోతాయి.

రెఫ్యూజీలకు మస్తు ఉపయోగం

ఉన్న దేశాల్లో బతకలేక వేరే దేశాలకు వలస పోయిన వాళ్లకు నీళ్లు దొరకడం కష్టం. కొన్ని అభివృద్ధి చెందని దేశాల్లోనూ వారానికి చేతితో బట్టలు ఉతకడానికి 12 గంటల వరకు సమయం పడుతోంది. దీంతో కొందరు బాలికలు ఈ పని చేస్తూ స్కూలుకెళ్లడం లేదని తెలిసింది. మహిళలు విపరీతంగా పని చేస్తుండటంతో ఒళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడుతున్నట్టు వెల్లడైంది. అలాంటి రెఫ్యూజీ ప్రాంతాలు, చేతితో బట్టలుతికే వాళ్లకు ఈ మెషీన్లు బాగా ఉపయోగపడనున్నాయని నవ్‌‌‌‌ చెప్పారు. ఇప్పటికే ట్రయల్‌‌‌‌ సక్సెసయిన ఈ మెషీన్లను త్వరలో ఇరాక్‌‌‌‌లోని కుర్దిష్‌‌‌‌ రెఫ్యూజీలున్న ప్రాంతాల్లో పంచనున్నారు. ఇరాక్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌, ఆక్స్‌‌‌‌ఫామ్‌‌‌‌ సాయంతో 50 మెషీన్లను తొలుత అందించనున్నారు.

ఫండ్‌‌‌‌ కోసం వెబ్‌‌‌‌సైట్‌‌‌‌

2019 మార్చిలో ఇరాక్‌‌‌‌కు వెళ్లామని, అక్కడ రెండు నమూనా యంత్రాలను వారం పాటు పరిశీలించి చూశామని, 79 ఫ్యామిలీలు వాడాయని నవ్‌‌‌‌ చెప్పారు. చాలా మంది మెషీన్‌‌‌‌ బాగుందని చెప్పారని, ఇంకా బాగా తయారు చేసేందుకు సలహాలూ ఇచ్చారని అన్నారు. మెషీన్లు తీసుకోవడానికి చాలా ఇంటర్నేషనల్‌‌‌‌ ఎన్జీవోలు ముందుకొచ్చాయన్నారు. ఫండ్‌‌‌‌ కోసం జస్ట్‌‌‌‌ గివింగ్‌‌‌‌ క్రౌడ్‌‌‌‌ పేజీని ప్రారంభించారు. దీనితో రెఫ్యూజీ మహిళల కష్టం తప్పుతుందని ఇరాక్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ ఇన్నోవేషన్‌‌‌‌ ల్యాబ్‌‌‌‌కు చెందిన నథాలియే చెప్పారు.