బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తానన్న హరీశ్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ లో తన ఫ్యూచర్ ఏంటో తెలియని హరీశ్..ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తుండా? బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ కలలు కంటున్నారని ఫైర్ అయ్యారు.
అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తామంటున్న హరీశ్ ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా డీల్ మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు పొంగులేటి.గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని పొంగులేటి ప్రశ్నించారు. మీకోసం ఫామ్ హౌస్లు కట్టుకుంటే మేం ఏకంగా ప్రజలకు ఇండ్లు కట్టిస్తున్నాం..ఏకంగా ఒక నగరమే కడుతున్నామని చెప్పారు పొంగులేటి. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని..అద్భుతమైన ఫ్యూచర్ సిటీ కడతామని అన్నారు.
