తెల్లకాగితాలపై సంతకాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రౌడీ రాజకీయం: భూమన

తెల్లకాగితాలపై సంతకాలు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రౌడీ రాజకీయం: భూమన

స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ రౌడీ రాజకీయం చేస్తోందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పోలీసులతో పాటు రిటర్నింగ్ అధికారులను కూడా కొనేశారంటూ ఆరోపించారు. నామినేషన్ల సమయంలో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారని విమర్శించారు. 

వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెల్లకాగితాలపై సంతకాలు తీసుకోవడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అన్నారు. వైసీపీ అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు ఉపసంహరించుకోరని స్పష్టం చేశారు.

విత్‌డ్రా చేసినట్లు ప్రకటిస్తే అధికారుల తీరుపై అనుమానించాల్సి వస్తుందన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన వివరాలను వీడియోతో రికార్డు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తెల్లకాగితాలపై సంతకాల ఆధారంగా విత్‌డ్రా ప్రకటిస్తే చెల్లదని స్పష్టం చేయాలని కోరారు.