వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్

 వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బయోపిక్

టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన మీరాబాయి చాను బయోపిక్ తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్ క్రీడల మొదటి రోజునే 49 కేజీల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో పాల్గొన్న మీరాబాయి చాను రజత పకం సాధించింది. ఈ పోటీలో ఇప్పటి వరకు భారతదేశానికి పతకం సాధించిన ఏకైక క్రీడాకారిణిగా మీరాబాయి చాను నిలిచారు. ఒలింపిక్ చరిత్రలో వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది రెండో ఒలింపిక్ పతకం.

చాను బయోపిక్‌ తీసేందుకు ఇంఫాల్‌కు చెందిన స్యూటి ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ముందుకొచ్చింది. దీనికి  సంబంధించి రెండు రోజుల క్రితం మణిపూర్‌లోని నాంగ్‌పాక్ కాచింగ్ గ్రామంలో ఉన్న మీరాబాయి చాను నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో మీరాబాయి, స్యూటి ఫిల్మ్ ప్రొడక్షన్స్‌.. అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేశారు. ఇంగ్లిష్‌తోపాటు వివిధ భారతీయ భాషల్లో డబ్ చేయనున్నట్లు బయోపిక్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న కంపెనీ ప్రెసిడెంట్ మనబ్ ఎంఎం తెలిపారు.