కార్మిక నాయకుడు అంటేనే కాకా: సీఎం రేవంత్ రెడ్డి

కార్మిక నాయకుడు అంటేనే కాకా: సీఎం రేవంత్ రెడ్డి

కార్మిక నాయకుడు అంటేనే కాకా వెంకట స్వామి(కాకా) అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.   ఇపుడు  కాకా  వారసుడు వివేక్ కార్మిక శాఖకు మంత్రిగా ఉండటం గర్వకారణమని కొనియాడారు. కనీస వేతనాల పెంపు విషయంపై మాట్లాడిన రేవంత్..  కార్మికుల సంక్షేమం కోసం మంత్రి  వివేక్ వెంకట్ స్వామి మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.

జూన్ 1 నుంచి కార్మికుల కనీస వేతనాలు పెంపు

తెలంగాణ కార్మికులకు రాష్ట్రప్రభుత్వం వరాలజల్లు కురిపించింది.కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని కోటి 11లక్షల మంది కార్మికులకు లబ్ది చేకూరనుంది. కార్మికుల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంటకస్వామితో కలిసి సీఎం రేవంత్  రెడ్డి కనీస వేతనాలు పెంపును ప్రకటించారు. 

కార్మికులను నాలుగు రకాలుగా విభిజించింది సర్కార్..  కార్మికులను కార్పొరేషన్ల పరధిలో  గ్రేడ్ 1, మున్సిపల్ పరిధిలో గ్రేడ్ 2, గ్రామీణ ప్రాంతాల్లో  గ్రేడ్ 3గా అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ గా విభజించి  కనీస వేతనాలు పెంచారు. జోన్ 1లో కనీస వేతనం రూ.12వేల 750 నుంచి రూ.16వేలకు  పెంచారు. స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 772 నుంచి రూ. 18వేల 500లకు,  జోన్ 1లో  సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.13వేల 592నుంచి రూ.17వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.