ఒలంపిక్స్‌లో భారతీయుడికి తొలిసారి దక్కిన అవకాశం

ఒలంపిక్స్‌లో భారతీయుడికి తొలిసారి దక్కిన అవకాశం

ఢిల్లీ: ఒలంపిక్స్ లో జిమ్నాస్టిక్స్ విభాగానికి మన దేశానికి చెందిన దీపక్ కబ్రా జడ్జిగా వ్యవహరించే అవకాశం దక్కింది. జపాన్ లోని టోక్యోలో ఈనెల 23న ఒలంపిక్స్ క్రీడా సంగ్రామం మొదలుకానున్న విషయం తెలిసిందే.  మహారాష్ట్రకు చెందిన దీపక్ కబ్రా ఒలంపిక్స్ విభాగంలో జడ్జిగా పాల్గొననున్నాడు. పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో క్రీడాకారుడిగా ప్రాతినిధ్యం వహించాడు. అయితే కెరీర్ ఆలస్యంగా మొదలుపెట్టినందున ఆటగాడిగా కంటే కోచ్ గా మారితే మంచి భవిష్యత్తు ఉంటుందన్న తన కోచ్, శ్రేయోభిలాషుల సూచనతో ఆటగాడి కెరీర్ ను తొందరగానే ఫుట్ స్టాప్ పెట్టి కోచ్ అవతారం ఎత్తాడు. తనకు లభించిన అవకాశంపై దీపక్ కబ్రా సంతోషం వ్యక్తం చేశాడు.

ఒలంపిక్స్ లో పాల్గొనడమనేది తన తీరని కల అని.. ఆటగాడిగా సాధ్యపడనిది కోచ్ గా ప్రాతినిధ్యం వహించే అదృష్టం వరించడం సంతోషకరంగా ఉందన్నారు. గత ఏడాడి కరోనా సమయంలోనే తనకు ఒలంపిక్స్ నిర్వాహకుల నుంచి సమాచారం వచ్చిందని.. దీపక్ కబ్రా గుర్తు చేసుకున్నారు. కరోనా ప్రబలడం.. లాక్ డౌన్ వల్ల అసలు ఒలంపిక్స్ జరుగుతాయా అన్న సందేహాలు వచ్చాయని.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ లో నే సమాచారం వచ్చినా.. మళ్లీ అదే పరిస్థితి ఉండడంతో సందేహించానన్నాడు. ఎట్టకేలకు మళ్లీ ఇప్పుడు అవకాశం రావడం.. పోటీలు మొదలవుతుండడం సంతోషకరంగా ఉందంటున్నాడు.