Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి

Josh Baker: 20 ఏళ్లకే లోకాన్ని విడిచాడు.. క్రికెటర్ అనుమానాస్పద మృతి

క్రికెట్ లో విషాదం చోటు చేసుకుంది. 20 ఏళ్ళ వయసులోనే ఇంగ్లాండ్ క్రికెటర్  జోష్ బేకర్ మరణించాడు. ఈ వార్త ఇంగ్లాండ్ క్రికెట్ ను షాక్ కు గురి చేసింది. ఈ యువ క్రికెటర్ ఎలా మరణించాడనే విషయం తెలియాల్సి ఉంది. వోర్సెస్టర్‌షైర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో బేకర్ మరణించడంతో విచారం వ్యక్తం చేసింది. “కేవలం 20 సంవత్సరాల వయస్సులో ఉన్న జోష్ బేకర్ అకాల మరణం మమ్మల్ని దిగ్బ్రాంతికి గురి చేసిందని ఆయన వోర్సెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తెలిపింది. 

2021లో 17 ఏళ్ల వయస్సులో జోష్ బేకర్ మొదటిసారి క్లబ్ క్రికెట్ ఆడాడు. మొత్తం 22 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 43 వికెట్లు, 25 వైట్-బాల్ మ్యాచ్ ల్లో మరో 27 వికెట్లు పడగొట్టాడు. 2023 జూలై లో గ్లౌసెస్టర్‌షైర్‌పై కెరీర్‌లో తన అత్యుత్తమ (75) స్కోర్ చేశాడు. అతని కెరీర్ లో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉండడం విశేషం. వోర్సెస్టర్‌షైర్, యార్క్‌షైర్‌ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరపున అండర్ 19 సెలక్టయ్యాడు.