
వంగూరు, వెలుగు : ప్రధాని మోదీతోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార, పశువర్ధక శాఖ మంత్రి మురుగన్ నారాయణ చెప్పారు. వంగూరు గేట్ వద్ద గల వైవీ ఫంక్షన్‌హాల్‌లో గురువారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయం నిర్మించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ లీడర్లు మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు ఆ మాటలు నమ్మకుండా బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ రాములు, బీజేపీ మండల అధ్యక్షుడు ఖానాపూర్ భాస్కర్, రాగి కొండల్‌రెడ్డి, అల్లే భీమయ్య, సైదులు, బాలాజీ, మన్యానాయక్ పాల్గొన్నారు.