చేవెళ్ల, వెలుగు : ‘నాకు మీ ఇంట్లో ఒక్కరు కూడా ఓటు వేయలేదు, మీ సంగతి చూస్తా’ అంటూ ఓ సర్పంచ్ క్యాండిడేట్ మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గోపులాపురంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావలి అనిల్ కుమార్ (28) ఓ యూనివర్సిటీలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సాయికుమార్ అనే వ్యక్తి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అనిల్‌కుమార్‌ను కలిసి.. మీ ఇంట్లో ఒక్కరు కూడా తనకు ఓటు వేయలేదని, మీ సంగతి చూస్తానంటూ రవి, చింటు అనే వ్యక్తులతో కలిసి సాయికుమార్ మందలించాడు. దీంతో తనను చంపేస్తారేమోనని భయపడిన అనిల్ బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన అతడి తల్లి చుట్టుపక్కల వాళ్లకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
