యూరియా కోసం వచ్చి ..రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

యూరియా కోసం వచ్చి ..రోడ్డు ప్రమాదంలో రైతు మృతి..రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొని యూరియా కోసం వచ్చిన రైతు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సాగర్ రోడ్డుపై బైక్ ను దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచాల మండలం వెంకటేశ్వర తండా గ్రామానికి చెందిన జాటావత్  హరియా(47) తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు.

యూరియా కోసం వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సాగర్ రోడ్డుపై డెడ్​బాడీతో ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్  చేశారు. దీంతో సాగర్  రోడ్డుపై కిలోమీటర్  మేర ట్రాఫిక్​ జామ్ అయింది. ఈ మేరకు యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.