ఓట్ల కోసం దిగజారుతున్న సీఎం :  మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి

ఓట్ల కోసం దిగజారుతున్న సీఎం :  మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి
  •  రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాదు..  రేవంత్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌గా చెప్పుకుంటున్నడు
  •     బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం
  •     కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి విమర్శ

చేవెళ్ల, వెలుగు : ‘సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఓట్ల కోసం రేవంత్‌‌‌‌‌‌‌‌ఖాన్‌‌‌‌‌‌‌‌గా చెప్పుకునే స్థాయికి దిగజారారు’ అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టే ధైర్యం లేకనే.. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికలు పెడుతున్నారని విమర్శించారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో భాగంగా ఆదివారం చేవెళ్లలో నిర్వహించిన కార్నర్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు ఎంపీ విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ... మిగులు బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పదేండ్లలో అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు.

అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల పేరిట దోపిడీ చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఇచ్చిన హామీలు సైతం అమలు చేయలేదని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం గట్టెక్కాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రూ. 4 వేల పింఛన్‌‌‌‌‌‌‌‌, రెండు లక్షల ఉద్యోగాలు, అమ్మాయిలకు స్కూటీలు, పెండ్లిళ్లకు రూ. లక్ష, తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

హామీలు అమలు చేయకుండా ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ఏడు రైల్వే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లు ప్రతిపాదిస్తే అందులో మూడు తెలంగాణలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రూ.1.50 లక్షల కోట్లతో నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవేలు నిర్మించామని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చేది కేంద్రమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే కేఎస్‌‌‌‌‌‌‌‌.రత్నం, బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు రాజ్‌‌‌‌‌‌‌‌భూపాల్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, నాయకులు అనంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీకాంత్, మాజీ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.