ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉన్న ఒక రెసిడెంట్ భవనంలో ఈరోజు (9 ఫిబ్రవరి)భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోగా, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం ఈ రోజు కుంకువాడిలోని ఫిరోజ్ షా మెహతా రోడ్డులో ఉన్న సువిధ పెర్ల్ అనే 13 అంతస్తుల భవనంలో 13వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది (MFB) రంగంలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు, మున్సిపల్ అధికారులు (BMC), ఎలక్ట్రిసిటీ విభాగం సహాయక చర్యలు చేపట్టాయి. సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
►ALSO READ | డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్: ఇక పై బ్యాంకులదే పూర్తి బాధ్యత !
ఈ ప్రమాదంలో 63 ఏళ్ల మహిళ మరణించినట్లు అధికారులు తెలిపారు. అలాగే 34 ఏళ్ల మరో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొద్దిరోజుల క్రితమే థానేలోని మరో భవనంలో కూడా ఇలాగే ఎలక్ట్రిక్ వైర్ల వల్ల ప్రమాదం జరిగి ఇద్దరు గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు భవనాల్లో అగ్నిమాపక భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
