దేశంలో కొత్తగా రెండు ఎయిర్లైన్స్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

దేశంలో  కొత్తగా రెండు ఎయిర్లైన్స్  కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
  • ఆల్ హింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లైఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ ఇచ్చిన కేంద్రం
  • కొత్త సంవత్సరంలో ప్రారంభంకానున్న శంక్ ఎయిర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ​ ఇండిగో సంక్షోభంతో  కొత్త సంస్థలకు వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ చెబుతున్న  ప్రభుత్వం
  • రీజినల్ క్యారియర్​ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విస్తరణ 

 

న్యూఢిల్లీ:  ఇండిగో సంక్షోభం తర్వాత కేంద్రం తన రూటు మార్చుకుంది. ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త కంపెనీలకు  వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్ చెబుతోంది.  రెండు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీల ఏర్పాటుకు  నో అబ్జెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ) ని ఇష్యూ చేసింది. ఆల్ హింద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లైఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను త్వరలో ప్రారంభించనున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన మరో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ శంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్ ఇప్పటికే  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓసీ పొందింది. కొత్త సంవత్సరంలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇండియా సివిల్ ఏవియేషన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేవలం కొన్ని కంపెనీలే నడిపిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా గ్రూప్ కంపెనీల వాటా 90 శాతం వరకు ఉంది. ఒక్క ఇండిగో వాటానే 65 శాతం ఉంది. ఇటీవల ఈ కంపెనీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్యాన్సిల్ చేస్తే మొత్తం ఇండస్ట్రీ సంక్షోభంలోకి జారుకుంది. ఒకే క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికంగా  ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన ద్వారా తెలిసొచ్చింది.  కొత్త కంపెనీల ఏంట్రీతో ఇండిగో షేర్లు నష్టపోయాయి. బుధవారం 1.41 శాతం తగ్గి రూ.5,082 వద్ద ముగిశాయి. 

9 ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలతోనే..

ప్రస్తుతం దేశంలో కేవలం తొమ్మిది షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రీజినల్ క్యారియర్ ఫ్లై బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విమాన సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆపేయడంతో ఈ సంఖ్య తగ్గింది.  స్పైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెట్ అప్పులతో ఇబ్బంది పడుతుండగా, మిగిలిన కంపెనీలు ఉడాన్ స్కీమ్ కింద రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సేవలందిస్తున్నాయి. కొత్తగా రాబోయే ఆల్‌‌ హింద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  కేరళలోని ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమోట్ చేస్తోంది. ఫ్లైఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ప్రమోటర్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. రీజినల్ సర్వీసులు అందించాలని చూస్తున్న  శంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శంక్ ఏవియేషన్ ప్రవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది. 

ప్రభుత్వ స్పందన

సివిల్ ఏవియేషన్ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేస్తూ తాజా అనుమతులను ధ్రువీకరించారు. శంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆల్ హింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లైఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను మంత్రిత్వ శాఖ కలిసిందన్నారు. భారత ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా పెరుగుతోందని, దీంతో  కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంపెనీలు రావాలని  ప్రభుత్వం  కోరుకుంటోందని నాయుడు తెలిపారు.  ఉడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పథకాలు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచాయని, చిన్న క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొత్త రూట్లలో విస్తరించడంలో సహాయపడ్డాయని వివరించారు.  స్టార్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండియావన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫ్లై91  వంటి కంపెనీలు చిన్న పట్టణాలను జాతీయ ఏవియేషన్ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపే పనిలో ఉన్నాయి. గతంలో  జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గో ఫస్ట్  వంటి క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అప్పులు, ఆపరేషనల్ సమస్యలతో మూతపడ్డాయి.  దీంతో ఏవియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవకాశాలు పెరిగాయి. 

ఇండియాలోని ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీల వివరాలు..

  • కంపెనీ    మార్కెట్ వాటా    ప్రస్తుత పరిస్థితి
  • ఇండిగో    65శాతం    అతిపెద్ద క్యారియర్
  • ఎయిర్ ఇండియా    13.6శాతం    ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది
  • ఎయిర్ ఇండియా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    6.3 శాతం    బడ్జెట్ ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్టేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంది
  • అలయెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    2 శాతం    ప్రభుత్వ కంపెనీ.  
  • ఉడాన్ కింద రీజినల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందిస్తోంది
  • ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    3-4శాతం    2021లో ప్రారంభమైంది. విస్తరణపై దృష్టి పెట్టింది
  • స్పైస్ జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    5 శాతం    ఆర్థిక సమస్యలు, అప్పులతో సతమతమవుతోంది
  • స్టార్ ఎయిర్    మార్కెట్ షేర్ లేదు    ఉడాన్ కింద కొన్ని రూట్లలో సేవలు
  • ఫ్లై91    మార్కెట్ షేర్ లేదు    కొత్తగా ప్రారంభమైన ప్రాంతీయ క్యారియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. 
  • ఉడాన్ రూట్లలో విస్తరిస్తోంది. 
  • ఇండియావన్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌    మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదు    చిన్న పట్టణాలను కనెక్ట్ చేస్తోంది