అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్

అమెరికాలో 30 మంది ఇండియన్లు అరెస్ట్
  • అమెరికాలో అక్రమంగా ఉంటున్న
  • పట్టుబడిన వారంతా ట్రక్ డ్రైవర్లే

న్యూయార్క్: అమెరికాలో అక్రమంగా ఉంటున్న 49 మందిని  యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు అరెస్టు చేశారు.  కమర్షియల్ డ్రైవర్ లైసెన్స్ (సీడీఎల్) కలిగి వీరిలో 30 మంది భారతీయులే ఉండడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలోఉంటూ వీరంతా వివిధ సంస్థల్లో సెమీ ట్రక్కులు నడుతున్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు కాలిఫోర్నియాలో ఎల్ సెంట్రో సెక్టార్‌‌లోని ఇమ్మిగ్రేషన్ చెక్‌‌పోస్టులు, హైవేలపై నిర్వహించిన వాహన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డిసెంబర్ 10, 11 వ తేదీల్లో ‘ఆపరేషన్ హైవే సెంటినల్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినప్పుడు అత్యధిక మంది పట్టుబడ్డట్టు తెలిసింది. ఈ ఆపరేషన్ కాలిఫోర్నియాలోని కమర్షియల్ ట్రక్కింగ్ కంపెనీలు లక్ష్యంగా సాగింది. ఇందులో ఇండియో స్టేషన్ ఏజెంట్లు ఏడుగురిని పట్టుకున్నారు. అక్రమ వలసదారులు నడుపుతున్న సెమీట్రక్కుల వల్ల పలు ఘోరమైన యాక్సిడెంట్లు జరిగాయి. దీంతో యూఎస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.